అందులోనే వున్నవివె అన్ని విన్నపములును
(॥పల్లవి॥)
అందులోనే వున్నవివె అన్ని విన్నపములును
కందువతోడఁ గలసీ కరుణించవయ్యా
(॥॥)
చెక్కులపై వెడజారుఁజెమట నీపచ్చడాన
గక్కనఁ దుడుచుకొనీఁ గామిని
వెక్కసపుఁ గుచముల వెట్ట దీర నీ చేతుల
అక్కరతో నద్దుకొనీ నప్పటప్పటికిని
(॥॥)
ఆలయిక లెల్లాఁ దీర నండ నున్న నీమీఁద
పలుమారు నొరగీని పడఁతి
నిలువుఁగొప్పు వీడితే నిన్నే ముడువుమనీ
తలఁపించి విరహపుతమకముతోడను
(॥॥)
తెల్లమిగాఁ దనదప్పి దేరుచుకొని మోవి
మెల్లనే చేకొనీ నలమేలుమంగ
చెల్లుబడి నీకాఁగిట శ్రీవేంకటేశుఁడు గూడి
యిల్లిదే నిన్నుఁ బొగడి యిచ్చకమాడీని
(||pallavi||)
aṁdulone vunnavivĕ anni vinnabamulunu
kaṁduvadoḍam̐ galasī karuṇiṁchavayyā
(||||)
sĕkkulabai vĕḍajārum̐jĕmaḍa nībachchaḍāna
gakkanam̐ duḍusugŏnīm̐ gāmini
vĕkkasabum̐ gusamula vĕṭṭa dīra nī sedula
akkarado naddugŏnī nappaḍappaḍigini
(||||)
ālayiga lĕllām̐ dīra naṁḍa nunna nīmīm̐da
palumāru nŏragīni paḍam̐ti
niluvum̐gŏppu vīḍide ninne muḍuvumanī
talam̐piṁchi virahabudamagamudoḍanu
(||||)
tĕllamigām̐ danadappi derusugŏni movi
mĕllane segŏnī nalamelumaṁga
sĕllubaḍi nīgām̐giḍa śhrīveṁkaḍeśhum̐ḍu gūḍi
yillide ninnum̐ bŏgaḍi yichchagamāḍīni