Amdulone vunnavaamdu aadimooridi

అందులోనె వున్నవాఁడు ఆదిమూరితి
Language

(॥పల్లవి॥)
అందులోనె వున్నవాఁడు ఆదిమూరితి
అందరాని పదవియైన నందిచ్చు నతఁడు

(॥అందు॥)
ఘను లిండ్ల వాకిళ్ళు కావఁ బొయ్యే జీవుఁడా
కని నీ యాత్మ వాకిలి కావరాదా
యెనసి పరులరాజ్య మేలఁబొయ్యే జీవుఁడా
అనిశము నీ మనోరాజ్యము నేలరాదా

(॥అందు॥)
చెలుల రూపము లెల్ల చింతించే జీవుఁడా
చెలఁగి నీ రూప మేదో చింతించ రాదా
కెలన సుఖములు భోగించేటి జీవుఁడౌ
పొలసి సుజ్ఞానము భోగించరాదా

(॥అందు॥)
చేవ సంసారాన బలిసిన యట్టి జీవుఁడా
భావపుటానందాన బలియరాదా
కోవరపు సంపదల కోరేటి జీవుఁడా
శ్రీ వేంకటేశుని సేవ గోరరాదా

(||pallavi||)
aṁdulonĕ vunnavām̐ḍu ādimūridi
aṁdarāni padaviyaina naṁdichchu nadam̐ḍu

(||aṁdu||)
ghanu liṁḍla vāgiḽḽu kāvam̐ bŏyye jīvum̐ḍā
kani nī yātma vāgili kāvarādā
yĕnasi parularājya melam̐bŏyye jīvum̐ḍā
aniśhamu nī manorājyamu nelarādā

(||aṁdu||)
sĕlula rūbamu lĕlla siṁtiṁche jīvum̐ḍā
sĕlam̐gi nī rūba medo siṁtiṁcha rādā
kĕlana sukhamulu bhogiṁcheḍi jīvum̐ḍau
pŏlasi sujñānamu bhogiṁcharādā

(||aṁdu||)
seva saṁsārāna balisina yaṭṭi jīvum̐ḍā
bhāvabuḍānaṁdāna baliyarādā
kovarabu saṁpadala koreḍi jīvum̐ḍā
śhrī veṁkaḍeśhuni seva gorarādā