Amdulone vinnabamu lanniyu nunnavi naagu

అందులోనే విన్నపము లన్నియు నున్నవి నాకు
Language

(॥పల్లవి॥)
అందులోనే విన్నపము లన్నియు నున్నవి నాకు
మందలించి ఇంతకంటె మరి నేరననరే

(॥అందు॥)
వద్దు వద్దు తనతోడివాదులకు నే నోప
పొద్దువొద్దు వాసులకే పోరలఁ బట్టె
కద్దుగద్దు నామీఁదఁ గడు మోహము దనకు
ముద్దుముద్దువలె నిట్టె మొక్కితి నే ననరే

(॥అందు॥)
చాలుఁజాలు చలములు సాదించఁ దరిగాదు
యేల యేల తనసుద్దు లిదె వింటివి
వేళ వేళ గాచికాచి వేగిరించితి నిందాఁక
మేలు మేలు దనపొందు మెచ్చితి నేననరే

(॥అందు॥)
సారె సారె బోమ్మలను జంకించఁ బనిలేదు
తీరెఁ దీరెఁ గోపమెల్లాఁ దేటపడెను
చేరెఁజేరెఁ గాఁగిటిలో శ్రీవేంకటేశ్వరుఁడు
పేరెఁబేరెఁ దేనెలెల్ల పెదవుల ననరే

(||pallavi||)
aṁdulone vinnabamu lanniyu nunnavi nāgu
maṁdaliṁchi iṁtagaṁṭĕ mari nerananare

(||aṁdu||)
vaddu vaddu tanadoḍivādulagu ne noba
pŏdduvŏddu vāsulage poralam̐ baṭṭĕ
kaddugaddu nāmīm̐dam̐ gaḍu mohamu danagu
muddumudduvalĕ niṭṭĕ mŏkkidi ne nanare

(||aṁdu||)
sālum̐jālu salamulu sādiṁcham̐ darigādu
yela yela tanasuddu lidĕ viṁṭivi
veḽa veḽa gāsigāsi vegiriṁchidi niṁdām̐ka
melu melu danabŏṁdu mĕchchidi nenanare

(||aṁdu||)
sārĕ sārĕ bommalanu jaṁkiṁcham̐ baniledu
tīrĕm̐ dīrĕm̐ gobamĕllām̐ deḍabaḍĕnu
serĕm̐jerĕm̐ gām̐giḍilo śhrīveṁkaḍeśhvarum̐ḍu
perĕm̐berĕm̐ denĕlĕlla pĕdavula nanare