Amdulone kaanavachchee nannibhaavaalu

అందులోనే కానవచ్చీ నన్నిభావాలు
Language

(॥పల్లవి॥)
అందులోనే కానవచ్చీ నన్నిభావాలు
విందులు వెట్టఁగరాదా వెలఁదికి వెూవి

(॥॥)
కొప్పు దువ్వి యాకె నిట్టె కోరి వొడఁ బరచేవు
కప్పిననీమాఁటలు కాదనీనా
చిప్పిల నింతటిలోనే చెక్కులెల్లాఁ జెమరించె
తప్పక చూడరాదా తరుణినెమ్మోము

(॥॥)
సెలవుల నవ్వుతానే సిగ్గు విడిపించేవు
చెలరేఁగి చెప్పినట్టు సేయకుండీనా
తలఁపులు దైవారి తనువెల్లాఁ బులకించె
సొలయుచు నీ వంటిచూడరాదా యింతి

(॥॥)
కూడితి వలమేల్మంగ గొంకక శ్రీ వేంకటేశ
పాడిపంతా లింకా నీతోఁ బచరించీనా
వేడుకకళలతోడ విఱ్ఱవీఁగి రతులకు
జోడై యిట్టె చూడరాదా సొబగు లిన్నియును

(||pallavi||)
aṁdulone kānavachchī nannibhāvālu
viṁdulu vĕṭṭam̐garādā vĕlam̐digi vĕూvi

(||||)
kŏppu duvvi yāgĕ niṭṭĕ kori vŏḍam̐ barasevu
kappinanīmām̐ṭalu kādanīnā
sippila niṁtaḍilone sĕkkulĕllām̐ jĕmariṁchĕ
tappaga sūḍarādā taruṇinĕmmomu

(||||)
sĕlavula navvudāne siggu viḍibiṁchevu
sĕlarem̐gi sĕppinaṭṭu seyaguṁḍīnā
talam̐pulu daivāri tanuvĕllām̐ bulagiṁchĕ
sŏlayusu nī vaṁṭisūḍarādā yiṁti

(||||)
kūḍidi valamelmaṁga gŏṁkaga śhrī veṁkaḍeśha
pāḍibaṁtā liṁkā nīdom̐ basariṁchīnā
veḍugagaḽaladoḍa viṭravīm̐gi radulagu
joḍai yiṭṭĕ sūḍarādā sŏbagu linniyunu