Amdulone kaanavachchee nanni panulu maagu

అందులోనే కానవచ్చీ నన్ని పనులు మాకు
Language

(॥పల్లవి॥)
అందులోనే కానవచ్చీ నన్ని పనులు మాకు
సందడి నేమి చెప్పినా సమ్మతి గాదెపుడు

(॥॥)
పడఁతి మీఁద నీకు బత్తే గలిగితేను
ఉడుగ కాపె పాదాలు వొత్తుమా చూతము
బడిబడి నీవిచ్చిన బాసలే నిజమైతే
గుడిగొని వీఁ పెక్కించుకొమ్మా నేఁడు చూతము

(॥॥)
సొగసి మీ యిద్దరికి చుట్టరికమే కలితే-
నొగి నెంగిలి పొత్తుకు నొగ్గుమా చూతము
మగువ చేఁతలకు నీమర్మములు గరఁగితే
తెగువతో గోళ్ల నొత్తించుకొమ్మా చూతము

(॥॥)
యెలమి నాపెకు నీకు నెరవులు లేకుండితే
బెళకకుండా నుద్దాలు పెట్టుమా చూతము
అలమేలుమంగ నేను ఆపె నీకుఁ బ్రియమైతే
కలసి శ్రీవేంకటేశ కైకొనుమా చూతము

(||pallavi||)
aṁdulone kānavachchī nanni panulu māgu
saṁdaḍi nemi sĕppinā sammadi gādĕbuḍu

(||||)
paḍam̐ti mīm̐da nīgu batte galigidenu
uḍuga kābĕ pādālu vŏttumā sūdamu
baḍibaḍi nīvichchina bāsale nijamaide
guḍigŏni vīm̐ pĕkkiṁchugŏmmā nem̐ḍu sūdamu

(||||)
sŏgasi mī yiddarigi suṭṭarigame kalide-
nŏgi nĕṁgili pŏttugu nŏggumā sūdamu
maguva sem̐talagu nīmarmamulu garam̐gide
tĕguvado goḽla nŏttiṁchugŏmmā sūdamu

(||||)
yĕlami nābĕgu nīgu nĕravulu leguṁḍide
bĕḽagaguṁḍā nuddālu pĕṭṭumā sūdamu
alamelumaṁga nenu ābĕ nīgum̐ briyamaide
kalasi śhrīveṁkaḍeśha kaigŏnumā sūdamu