అందులోనే కానవచ్చె నన్నిపనులు
(॥పల్లవి॥)
అందులోనే కానవచ్చె నన్నిపనులు
మందలించి యాపెతోడిమాటలు మానుమా
(॥॥)
మనసిచ్చి నీవు నన్ను మన్నించేవాఁడవైతే
ననిచిన యాకెతోడ నవ్వకుండుమా
యొనసి యేపొద్దూ నన్ను నెడయనివాఁడవైతే
పొనిఁగి యాపెయింటికిఁ బోక ఇట్టె వుండుమా
(॥॥)
చేకొని నాచెప్పినట్టు సేసేటివాఁడవైతే
జోకలుగా నాపెదిక్కు చూడకుండుమా
నాకిచ్చినబాసతోడ నమ్మించినవాఁడవైతే
దాకోని యాపెపొందులు తలచక వుండుమా
(॥॥)
మిక్కిలి నామీదను మేలుగలవాఁడవైతే
అక్కరతో నాపెకాని కందకుండుమా
యిక్కడ శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
అక్కున నన్నుఁ బెట్టితి వాకె నంటకుండుమా
(||pallavi||)
aṁdulone kānavachchĕ nannibanulu
maṁdaliṁchi yābĕdoḍimāḍalu mānumā
(||||)
manasichchi nīvu nannu manniṁchevām̐ḍavaide
nanisina yāgĕdoḍa navvaguṁḍumā
yŏnasi yebŏddū nannu nĕḍayanivām̐ḍavaide
pŏnim̐gi yābĕyiṁṭigim̐ boga iṭṭĕ vuṁḍumā
(||||)
segŏni nāsĕppinaṭṭu seseḍivām̐ḍavaide
jogalugā nābĕdikku sūḍaguṁḍumā
nāgichchinabāsadoḍa nammiṁchinavām̐ḍavaide
dāgoni yābĕbŏṁdulu talasaga vuṁḍumā
(||||)
mikkili nāmīdanu melugalavām̐ḍavaide
akkarado nābĕgāni kaṁdaguṁḍumā
yikkaḍa śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
akkuna nannum̐ bĕṭṭidi vāgĕ naṁṭaguṁḍumā