Amdulone kaanaraadaa adiva yeedani suddi

అందులోనే కానరాదా అతివ యీతని సుద్ది
Language

(॥పల్లవి॥)
అందులోనే కానరాదా అతివ యీతని సుద్ది
కందువ లన్నియు నీవె కనుఁగొనఁ గదవె

(॥॥)
సెలవినేల నవ్వీనే చేరి నే మోము చూచితే
లలిఁ దనవంకను కల్లలేనివాఁడు
ములువాడిఁగోర నేను మోపితేనే లలికీనే
వెలుపల లోనాను వెరపులేనివాఁడు

(॥॥)
సిగ్గులేల పెంచీనే చెయ్యివట్టి తీసితేను
యెగ్గులుఁదప్పులులేక యేచినవాఁడు
దిగ్గనఁ గాఁగిలించితే దిక్కులేక చూచీనే
బగ్గన నెవ్వతెకైనా బాసియ్యనివాఁడు

(॥॥)
శిరనేల వంచీనే చెంత మోవి నే నంటితే
విరసమెరఁగనిశ్రీవేంకటేశుఁడు
అరిది నలమేల్మంగనై కూడితే మెచ్చనేలే
గొరబై యెవ్వరికిని గుట్టియ్యనివాఁడు

(||pallavi||)
aṁdulone kānarādā adiva yīdani suddi
kaṁduva lanniyu nīvĕ kanum̐gŏnam̐ gadavĕ

(||||)
sĕlavinela navvīne seri ne momu sūside
lalim̐ danavaṁkanu kallalenivām̐ḍu
muluvāḍim̐gora nenu mobidene laligīne
vĕlubala lonānu vĕrabulenivām̐ḍu

(||||)
siggulela pĕṁchīne sĕyyivaṭṭi tīsidenu
yĕggulum̐dappululega yesinavām̐ḍu
digganam̐ gām̐giliṁchide dikkulega sūsīne
baggana nĕvvadĕgainā bāsiyyanivām̐ḍu

(||||)
śhiranela vaṁchīne sĕṁta movi ne naṁṭide
virasamĕram̐ganiśhrīveṁkaḍeśhum̐ḍu
aridi nalamelmaṁganai kūḍide mĕchchanele
gŏrabai yĕvvarigini guṭṭiyyanivām̐ḍu