Amdulagum daginattu appude soosugomdunu

అందులకుఁ దగినట్టు అప్పుడే చూచుకొందును
Language

(॥పల్లవి॥)
అందులకుఁ దగినట్టు అప్పుడే చూచుకొందును
ముందుముందే యింతసేసే మొరఁగులు గాననైతి

(॥అందు॥)
పిలువనంపెననేటి పెద్దరికమే చూచితి
తలఁపు వెరొకటౌట దలఁచనైతి
నిలిచి మాటాడెనని నెయ్యపుమేలే యెంచితి
వలపని జోలిమాటలవ గెఱఁగనైతి

(॥అందు॥)
యీరానచనవులెల్ల నిచ్చేదే చూచితిఁగాని
దారకాన మచ్చుచల్లి తగిలించే దెంచనైతి
చేరి ప్రియములు సారెఁ జెప్పేదే చూచితిఁగాని
కారించి నాకొడఁబాటుగానిపని చూడనైతి

(॥అందు॥)
కాఁగిలించి బుజ్జగించేఘనతే చూచితిఁగాని
ఆఁగి మేలుమరపించే ఆయము దెలియనైతి
రాఁగినశ్రీవేంకటేశురతులఁ గూడితిఁగాని
యేఁగించి పురమెక్కించే ఇక్కువ దెలియనైతి

(||pallavi||)
aṁdulagum̐ daginaṭṭu appuḍe sūsugŏṁdunu
muṁdumuṁde yiṁtasese mŏram̐gulu gānanaidi

(||aṁdu||)
piluvanaṁpĕnaneḍi pĕddarigame sūsidi
talam̐pu vĕrŏgaḍauḍa dalam̐sanaidi
nilisi māḍāḍĕnani nĕyyabumele yĕṁchidi
valabani jolimāḍalava gĕṟam̐ganaidi

(||aṁdu||)
yīrānasanavulĕlla nichchede sūsidim̐gāni
dāragāna machchusalli tagiliṁche dĕṁchanaidi
seri priyamulu sārĕm̐ jĕppede sūsidim̐gāni
kāriṁchi nāgŏḍam̐bāḍugānibani sūḍanaidi

(||aṁdu||)
kām̐giliṁchi bujjagiṁcheghanade sūsidim̐gāni
ām̐gi melumarabiṁche āyamu dĕliyanaidi
rām̐ginaśhrīveṁkaḍeśhuradulam̐ gūḍidim̐gāni
yem̐giṁchi puramĕkkiṁche ikkuva dĕliyanaidi