Amdulage visaarimche nappadanumdi

అందులకె విచారించే నప్పటనుండి
Language

(॥పల్లవి॥)
అందులకె విచారించే నప్పటనుండి
కందువకుఁ బెనఁగఁగా గబ్బి ననవు గదా

(॥అందు॥)
పచ్చిదేర నీతో నేను పక పక నవ్వఁగాను
అచ్చలాన మందెమేళ మనవుగదా
మచ్చికతో సారెసారె మాటపలు కాడఁగాను
రచ్చలోన నిది యెంత రట్టడెనవుగదా

(॥అందు॥)
సతమై యే పొద్దూ నే నీ సరుసఁ గూచుండఁగాను
అతిగర్వియంటా నన్ను ననవుగదా
తతిగొని యెప్పుడూ బాదమును నే నొత్తఁగాను
మితిమీరి మిక్కిలి గామిడి యనవుగదా

(॥అందు॥)
గుట్టుతో గాఁగిట నేను గుబ్బల నిన్నొత్తఁగాను
అట్టె యాసోదకతై ననవుగదా
గట్టిగా శ్రీవేంకటేశ కలసితి విటునన్ను
బట్టువలెఁ గొనేడఁగ బగ్గడెనవుగదా

(||pallavi||)
aṁdulagĕ visāriṁche nappaḍanuṁḍi
kaṁduvagum̐ bĕnam̐gam̐gā gabbi nanavu gadā

(||aṁdu||)
pachchidera nīdo nenu paga paga navvam̐gānu
achchalāna maṁdĕmeḽa manavugadā
machchigado sārĕsārĕ māḍabalu kāḍam̐gānu
rachchalona nidi yĕṁta raṭṭaḍĕnavugadā

(||aṁdu||)
sadamai ye pŏddū ne nī sarusam̐ gūsuṁḍam̐gānu
adigarviyaṁṭā nannu nanavugadā
tadigŏni yĕppuḍū bādamunu ne nŏttam̐gānu
midimīri mikkili gāmiḍi yanavugadā

(||aṁdu||)
guṭṭudo gām̐giḍa nenu gubbala ninnŏttam̐gānu
aṭṭĕ yāsodagadai nanavugadā
gaṭṭigā śhrīveṁkaḍeśha kalasidi viḍunannu
baṭṭuvalĕm̐ gŏneḍam̐ga baggaḍĕnavugadā