Amdulage veragayyee nappadanumdi naagu

అందులకే వెరగయ్యీ నప్పటనుండి నాకు
Language

(॥పల్లవి॥)
అందులకే వెరగయ్యీ నప్పటనుండి నాకు
కందువ నెన్నాళ్లనుండి కాచుకవున్నదియో

(॥అందు॥)
కొత్త కొత్త మాఁట లాడీ కొమలి నీ తోడుత
యిత్తల వావిని నీకు నీమౌనోకాని
హత్తి కొలువులు సేసీ నప్పటి వేడుకతోడ
బత్తి నీపై నెంతగద్దో భావించితేఁ దనకు

(॥అందు॥)
సొలసి సొలసి నిన్నుఁ జూచీని పలుమారు
పొలుపుగ నేనాఁటిపొందుగాని
చెలరేఁగి సేయరాని సేవలెల్లాఁ జేసీ నీకు
కొలఁదిమీర నిన్నేమి గోరీనో తాను

(॥అందు॥)
నవ్వి నవ్వి మేలమాడీ ననుపున నీతోను
నివ్వటిల్లఁ దనయాస నీపై నెంతో
యివ్వల శ్రీవేంకటేశ యేలితిని నన్ను నేఁడు
రవ్వగాఁ దాఁ గాఁగిలించి రతికెక్క నిపుడు

(||pallavi||)
aṁdulage vĕragayyī nappaḍanuṁḍi nāgu
kaṁduva nĕnnāḽlanuṁḍi kāsugavunnadiyo

(||aṁdu||)
kŏtta kŏtta mām̐ṭa lāḍī kŏmali nī toḍuda
yittala vāvini nīgu nīmaunogāni
hatti kŏluvulu sesī nappaḍi veḍugadoḍa
batti nībai nĕṁtagaddo bhāviṁchidem̐ danagu

(||aṁdu||)
sŏlasi sŏlasi ninnum̐ jūsīni palumāru
pŏlubuga nenām̐ṭibŏṁdugāni
sĕlarem̐gi seyarāni sevalĕllām̐ jesī nīgu
kŏlam̐dimīra ninnemi gorīno tānu

(||aṁdu||)
navvi navvi melamāḍī nanubuna nīdonu
nivvaḍillam̐ danayāsa nībai nĕṁto
yivvala śhrīveṁkaḍeśha yelidini nannu nem̐ḍu
ravvagām̐ dām̐ gām̐giliṁchi radigĕkka nibuḍu