అందుకుఁగా చెలి నవ్వి అంగమెల్లాఁ జెమరించె
(॥పల్లవి॥)
అందుకుఁగా చెలి నవ్వి అంగమెల్లాఁ జెమరించె
సందడి జాణతనాల సరసుఁడ వవుదువు
(॥అందు॥)
తెప్పమీఁద నుండి నీవు దిక్కులు చూడఁగాను
అప్పుడు తామెరఁ గొని అతివ వేసె
తప్పువట్టి యంతలోనే తాకెనంటా నీమేను
రెప్పలెత్తి చూచేవు రేసు లిఁకనేఁటికి
(॥అందు॥)
పంతముతో జలకేలిఁ బరాకై వుండగాను
అంతలో జలము చల్లె అంగన నిన్ను
వంతుకుఁ దిట్టేవు నీవన్నె దొప్పఁదోఁగెనంటా
యెంత బొమ్మల జంకించే వెగసక్కేలేఁటికి
(॥అందు॥)
చంచుల గోనేటిలోన చల్లగా నీవు దేలఁగా
మించి కాగిలించె నలమేలుమంగ
ముంచి శ్రీవేంకటేశుఁడ మొక్కేవు బిగించెనంటా
పొంచి సరివెనఁగేవు బూటకము లేఁటికి
(||pallavi||)
aṁdugum̐gā sĕli navvi aṁgamĕllām̐ jĕmariṁchĕ
saṁdaḍi jāṇadanāla sarasum̐ḍa vavuduvu
(||aṁdu||)
tĕppamīm̐da nuṁḍi nīvu dikkulu sūḍam̐gānu
appuḍu tāmĕram̐ gŏni adiva vesĕ
tappuvaṭṭi yaṁtalone tāgĕnaṁṭā nīmenu
rĕppalĕtti sūsevu resu lim̐kanem̐ṭigi
(||aṁdu||)
paṁtamudo jalagelim̐ barāgai vuṁḍagānu
aṁtalo jalamu sallĕ aṁgana ninnu
vaṁtugum̐ diṭṭevu nīvannĕ dŏppam̐dom̐gĕnaṁṭā
yĕṁta bŏmmala jaṁkiṁche vĕgasakkelem̐ṭigi
(||aṁdu||)
saṁchula goneḍilona sallagā nīvu delam̐gā
miṁchi kāgiliṁchĕ nalamelumaṁga
muṁchi śhrīveṁkaḍeśhum̐ḍa mŏkkevu bigiṁchĕnaṁṭā
pŏṁchi sarivĕnam̐gevu būḍagamu lem̐ṭigi