Amdugu sarigi sari aayanoyi

అందుకు సరికి సరి ఆయనోయి
Language

(॥పల్లవి॥)
అందుకు సరికి సరి ఆయనోయి
పందెమాడినట్లాయఁ బదరకు మికఁను

(॥అందు॥)
మోవి నాకుఁ జవిచూపి ముచ్చటలన్నియుఁ బాసి
ఆవేళ మాటాడఁజూచే వౌనోయి
తావివీడెపురసము తగ నీపుక్కిట నించి
యీవిధాన గెలిచితి నేమి సేసే విఁకను

(॥అందు॥)
పయ్యదలో జేఁచాచి పక్కఁన గళలురేఁచి
ఆయ్యెడ నామోము చూచే వౌనోయి
చెయ్యారఁ గాఁగిట నొత్తి చెక్కు చెక్కున నదిమి
నెయ్యానఁ జొక్కించితి నీట్లేల యిఁకను

(॥అందు॥)
రతి నన్ను మఱపించి రాతిటిసుద్దు లడిగేవు
అతినేరుపరితన మౌనొయి
యితవై శ్రీవేంకటేశ యిందుకు మారుకుమారు
తతిగా నిన్నే కూడితి తలఁచుకో ఇఁకను

(||pallavi||)
aṁdugu sarigi sari āyanoyi
paṁdĕmāḍinaṭlāyam̐ badaragu migam̐nu

(||aṁdu||)
movi nāgum̐ javisūbi muchchaḍalanniyum̐ bāsi
āveḽa māḍāḍam̐jūse vaunoyi
tāvivīḍĕburasamu taga nībukkiḍa niṁchi
yīvidhāna gĕlisidi nemi sese vim̐kanu

(||aṁdu||)
payyadalo jem̐sāsi pakkam̐na gaḽalurem̐si
āyyĕḍa nāmomu sūse vaunoyi
sĕyyāram̐ gām̐giḍa nŏtti sĕkku sĕkkuna nadimi
nĕyyānam̐ jŏkkiṁchidi nīṭlela yim̐kanu

(||aṁdu||)
radi nannu maṟabiṁchi rādiḍisuddu laḍigevu
adinerubaridana maunŏyi
yidavai śhrīveṁkaḍeśha yiṁdugu mārugumāru
tadigā ninne kūḍidi talam̐sugo im̐kanu