Amdugu nimdugu vimtalaayanayyaa

అందుకు నిందుకు వింతలాయనయ్యా
Language

(॥పల్లవి॥)
అందుకు నిందుకు వింతలాయనయ్యా
అందాలుగాఁ జెప్పుదువు ఆడకు రావయ్యా

(॥అందు॥)
అంగనకుఁ గస్తూరి ఆంపేనంటి వదేదయ్య
చెంగల వింతలో మఱచితివా అయ్య
ముంగిటిచెలులఁ జూచి ముందెరఁగనా అయ్య
యెంగిలాయ నీమోవి యిదేఁటిదయ్యా

(॥అందు॥)
సగమా కందుకొంటి వాసగమూ బుత్తెంచెదయ్య
వగలేమిఁ దలఁచక వచ్చితివయ్యా
బగివాసి ఇంతలోనే భ్రమసితివా అయ్య
చిగురువంటి నీమేను జీరలాయనయ్యా

(॥అందు॥)
పాటించినసగినాలు పనికివచ్చెనో అయ్య
గాఁటాన మగిడి ఇంతిఁ గంటివయ్యా
యీటున శ్రీవేంకటేశ ఇద్దరుఁ గూడితిరయ్య
నీటుఁజెక్కుల చెమట నిండుకొనెనయ్య

(||pallavi||)
aṁdugu niṁdugu viṁtalāyanayyā
aṁdālugām̐ jĕppuduvu āḍagu rāvayyā

(||aṁdu||)
aṁganagum̐ gastūri āṁpenaṁṭi vadedayya
sĕṁgala viṁtalo maṟasidivā ayya
muṁgiḍisĕlulam̐ jūsi muṁdĕram̐ganā ayya
yĕṁgilāya nīmovi yidem̐ṭidayyā

(||aṁdu||)
sagamā kaṁdugŏṁṭi vāsagamū buttĕṁchĕdayya
vagalemim̐ dalam̐saga vachchidivayyā
bagivāsi iṁtalone bhramasidivā ayya
siguruvaṁṭi nīmenu jīralāyanayyā

(||aṁdu||)
pāḍiṁchinasaginālu panigivachchĕno ayya
gām̐ṭāna magiḍi iṁtim̐ gaṁṭivayyā
yīḍuna śhrīveṁkaḍeśha iddarum̐ gūḍidirayya
nīḍum̐jĕkkula sĕmaḍa niṁḍugŏnĕnayya