Amdugu manasu nilba nalavigaadu gaani

అందుకు మనసు నిల్ప నలవిగాదు గాని
Language

(॥పల్లవి॥)
అందుకు మనసు నిల్ప నలవిగాదు గాని
కందువతో నీపొందు కలకాలము మేలు

(॥అందు॥)
వెదకి వెదకి నీపై విరహాన వేఁగుకంటే
కొదదీర నిద్రించినాఁ గొంతమేలు
యెదురులు చూచి నీకు నేఁకారుతానుండుకంటే
చదురంగమాడి పొద్దు జరపినా మేలు

(॥అందు॥)
ఆసల నిన్నుఁ దలఁచి యసురుసురవుకంటే
వేసరక చుక్క లెంచివేసినా మేలు
నీసుద్దులు వినివిని నెమ్మి గుబ్బతిలుకంటే
వాసితో నింటిలో వీణ వాయించినా మేలు

(॥అందు॥)
నవ్వులు నవ్వుతా నిన్ను నాఁటఁగఁ జూచుటకంటే
చివ్వన నీమోవి గంటిసేయుటే మేలు
యివ్వల శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
నివ్వటిల్లేమనరతినివ్వెరగే మేలు

(||pallavi||)
aṁdugu manasu nilba nalavigādu gāni
kaṁduvado nībŏṁdu kalagālamu melu

(||aṁdu||)
vĕdagi vĕdagi nībai virahāna vem̐gugaṁṭe
kŏdadīra nidriṁchinām̐ gŏṁtamelu
yĕdurulu sūsi nīgu nem̐kārudānuṁḍugaṁṭe
saduraṁgamāḍi pŏddu jarabinā melu

(||aṁdu||)
āsala ninnum̐ dalam̐si yasurusuravugaṁṭe
vesaraga sukka lĕṁchivesinā melu
nīsuddulu vinivini nĕmmi gubbadilugaṁṭe
vāsido niṁṭilo vīṇa vāyiṁchinā melu

(||aṁdu||)
navvulu navvudā ninnu nām̐ṭam̐gam̐ jūsuḍagaṁṭe
sivvana nīmovi gaṁṭiseyuḍe melu
yivvala śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
nivvaḍillemanaradinivvĕrage melu