అందుకెంత సేసేవు అప్పటి నీవు
(॥పల్లవి॥)
అందుకెంత సేసేవు అప్పటి నీవు
కిందుపడి మొక్కఁగాను కేలు దాఁకెనపుడు
(॥అందు॥)
వెక్కసా లాడఁగ నేల వేడుకో నప్పటి నేల
వొక్కరీతినే గుట్టున నుండనీరాదా
చక్కనిరమణికి నీచనవిచ్చి రమ్మనఁగా
చెక్కునొక్కఁ బోతేను జీరవారె నపుడు
(॥అందు॥)
సోఁక నలయించనేల సురటి విసరనేల
వూఁ కొనినమేలుతోడ నుండనీరాదా
యేఁకరి నీవే మోవియిమ్మనఁగాఁ దనపల్లు
సోఁకితేనే ముద్రలై చూపట్టెనపుడు
(॥అందు॥)
కడుఁగాక రేఁచనేల గందము వుయ్యఁగనేల
వొడికాన నీవద్ద నుండనీరాదా
అడరి శ్రీ వేంకటేశ అప్పణిచ్చి కూడఁగాను
వుడివోక వురముపై నునికాయనిపుడు
(||pallavi||)
aṁdugĕṁta sesevu appaḍi nīvu
kiṁdubaḍi mŏkkam̐gānu kelu dām̐kĕnabuḍu
(||aṁdu||)
vĕkkasā lāḍam̐ga nela veḍugo nappaḍi nela
vŏkkarīdine guṭṭuna nuṁḍanīrādā
sakkaniramaṇigi nīsanavichchi rammanam̐gā
sĕkkunŏkkam̐ bodenu jīravārĕ nabuḍu
(||aṁdu||)
som̐ka nalayiṁchanela suraḍi visaranela
vūm̐ kŏninameludoḍa nuṁḍanīrādā
yem̐kari nīve moviyimmanam̐gām̐ danaballu
som̐kidene mudralai sūbaṭṭĕnabuḍu
(||aṁdu||)
kaḍum̐gāga rem̐sanela gaṁdamu vuyyam̐ganela
vŏḍigāna nīvadda nuṁḍanīrādā
aḍari śhrī veṁkaḍeśha appaṇichchi kūḍam̐gānu
vuḍivoga vuramubai nunigāyanibuḍu