అందుకేమి రావయ్య అంతవాఁడవు
(॥పల్లవి॥)
అందుకేమి రావయ్య అంతవాఁడవు
చందాలు సేసీ నిదె చక్కని నీరూపము
(॥అందు॥)
గొప్పలు మా చన్నులు కొంచము మానడుము
యెప్పుడు మా వొళ్ల లేవా యెచ్చకుందులు
తప్పులు నీవల్లనుంటే తలవంచుకోనేల
కప్పిపోయ పూసినట్టి గందపుఁ బూఁతలును
(॥అందు॥)
తెల్లని మా కన్నులలో దిష్టించి నల్లగుడ్లు
అల్లుకొని రెండు నీపై నాడించేము
కల్లలు నీమాటలైతే కడు సిగ్గువడనేల
చెల్లు బడాయ నన్నీ నీ సేసిన బాసలనే
(॥అందు॥)
జంకెలు మా బొమ్మలున్ను సరి నవ్వు సెలవుల
వుంకువై శ్రీ వేంకటేశ వొక్కటైతిని
లంకె నలమేల్మంగను లలి భూసతిఁ దెచ్చితి
పొంకమాయ నీవిపుడు భోగించిన భోగము
(||pallavi||)
aṁdugemi rāvayya aṁtavām̐ḍavu
saṁdālu sesī nidĕ sakkani nīrūbamu
(||aṁdu||)
gŏppalu mā sannulu kŏṁchamu mānaḍumu
yĕppuḍu mā vŏḽla levā yĕchchaguṁdulu
tappulu nīvallanuṁṭe talavaṁchugonela
kappiboya pūsinaṭṭi gaṁdabum̐ būm̐talunu
(||aṁdu||)
tĕllani mā kannulalo diṣhṭiṁchi nallaguḍlu
allugŏni rĕṁḍu nībai nāḍiṁchemu
kallalu nīmāḍalaide kaḍu sigguvaḍanela
sĕllu baḍāya nannī nī sesina bāsalane
(||aṁdu||)
jaṁkĕlu mā bŏmmalunnu sari navvu sĕlavula
vuṁkuvai śhrī veṁkaḍeśha vŏkkaḍaidini
laṁkĕ nalamelmaṁganu lali bhūsadim̐ dĕchchidi
pŏṁkamāya nīvibuḍu bhogiṁchina bhogamu