అందుకేమి పదరాదా ఆనలేల సతివద్ద
(॥పల్లవి॥)
అందుకేమి పదరాదా ఆనలేల సతివద్ద
కందువ మగవానికిఁ గలదే కాదా
(॥॥)
చెప్పకుండునా బుద్ది చేరకుండా నెవ్వరిని
యెప్పుడూ నాకెవద్దికి నేగినవేళ
అప్పుడే యందుకు నిచ్చలాడక నీవుందువా
చప్పఁజేసి యవి నేను సాగనీఁగాక
(॥॥)
చేయకుండునా ఆకె చెల్లినట్టెల్లా, నీవు
చేయూరఁ గాఁగిటిలోనఁ జిక్కినవేళ
యీయకుందువా బాస యిందరి విడుతునని
పోయినట్టెల్లా నిన్నుఁ బోనీఁగాక
(॥॥)
అనకుండునా తానె ఆకె దొడ్డదానవని
వినకుందువా నీవు వేళావేళ
అనుగు శ్రీ వేంకటేశ అలమేలుమంగ నేను
తనీయ నే నిన్నుఁ గూడి దక్కఁగొంటిఁగాక
(||pallavi||)
aṁdugemi padarādā ānalela sadivadda
kaṁduva magavānigim̐ galade kādā
(||||)
sĕppaguṁḍunā buddi seraguṁḍā nĕvvarini
yĕppuḍū nāgĕvaddigi neginaveḽa
appuḍe yaṁdugu nichchalāḍaga nīvuṁduvā
sappam̐jesi yavi nenu sāganīm̐gāga
(||||)
seyaguṁḍunā āgĕ sĕllinaṭṭĕllā, nīvu
seyūram̐ gām̐giḍilonam̐ jikkinaveḽa
yīyaguṁduvā bāsa yiṁdari viḍudunani
poyinaṭṭĕllā ninnum̐ bonīm̐gāga
(||||)
anaguṁḍunā tānĕ āgĕ dŏḍḍadānavani
vinaguṁduvā nīvu veḽāveḽa
anugu śhrī veṁkaḍeśha alamelumaṁga nenu
tanīya ne ninnum̐ gūḍi dakkam̐gŏṁṭim̐gāga