Amdugemi dosamu gaadaanadeevayyaa

అందుకేమి దోసము గాదానతీవయ్యా
Language

(॥పల్లవి॥)
అందుకేమి దోసము గాదానతీవయ్యా
విందులుగా వీనులను వినే నేను

(॥॥)
మగువలతోనెల్లా మాఁటలు నీ వాడఁగానో
చిగురాకు నీమోవి చేగయెక్కెను
మొగి వారితోడ సాములు నీవు సేయఁగానో
జాగిమించు చెక్కులెల్లాఁ జెమరించెను

(॥॥)
సారె సారెఁ జెలరేఁగి సరసములాడఁగానో
చీరుమూరై మేనెల్ల జీరలాయను
చేరి చేరి లోలోను సేసలు చల్లుకోఁగానో
కూరిములు చూపట్టఁ గురులు చెదరెను

(॥॥)
ననుపులు సేసుకొని నవ్వులు నవ్వఁగానో
నినుపుగా నిట్టూర్పులు నిగుడఁజొచ్చె
ఘనుఁడ శ్రీవేంకటేశ కాఁగిట నన్నేలితివి
కనుపట్టి నీమోమునఁ గళలు దైవారెను

(||pallavi||)
aṁdugemi dosamu gādānadīvayyā
viṁdulugā vīnulanu vine nenu

(||||)
maguvaladonĕllā mām̐ṭalu nī vāḍam̐gāno
sigurāgu nīmovi segayĕkkĕnu
mŏgi vāridoḍa sāmulu nīvu seyam̐gāno
jāgimiṁchu sĕkkulĕllām̐ jĕmariṁchĕnu

(||||)
sārĕ sārĕm̐ jĕlarem̐gi sarasamulāḍam̐gāno
sīrumūrai menĕlla jīralāyanu
seri seri lolonu sesalu sallugom̐gāno
kūrimulu sūbaṭṭam̐ gurulu sĕdarĕnu

(||||)
nanubulu sesugŏni navvulu navvam̐gāno
ninubugā niṭṭūrbulu niguḍam̐jŏchchĕ
ghanum̐ḍa śhrīveṁkaḍeśha kām̐giḍa nannelidivi
kanubaṭṭi nīmomunam̐ gaḽalu daivārĕnu