Amdugemi dosamaa ayinattayyeemgaani

అందుకేమి దోసమా అయినట్టయ్యీఁగాని
Language

(॥పల్లవి॥)
అందుకేమి దోసమా అయినట్టయ్యీఁగాని
పొందినయప్పుడుగాని పూఁపు గానరాదురా

(॥అందు॥)
కొమలపుకృష్ణుఁడ నీ గొల్లబాలతనమేల
కామునిగరిడిఁగాని కానరాదురా
బూమెల నీవాడుకోన్న బొమ్మచారితన మెల్ల
పామిడిగొల్లెతలందే పచ్చిదేరీఁ బదరా

(॥అందు॥)
నిగ్గులమునులతోడ నీచదివేవేదములు
సిగ్గుల కొట్టఁగొనల చేఁగదేరీరా
దగ్గరితే నీకుఁ బెద్దతనముతో పూజలెల్ల
ఆగ్గపువెన్నముచ్చిమియందు చూపీఁ బదరా

(॥అందు॥)
చక్కఁగా నీదొడ్డరాజసపుదొరతనమెల్ల
తక్కి నావుపరిసురతమే చూపీరా
అక్కరై శ్రీవేంకటేశ ఆయమంటి కూడితివి
దిక్కుల నేమిసేసినా దేవుఁడ వనేరా

(||pallavi||)
aṁdugemi dosamā ayinaṭṭayyīm̐gāni
pŏṁdinayappuḍugāni pūm̐pu gānarādurā

(||aṁdu||)
kŏmalabukṛṣhṇum̐ḍa nī gŏllabāladanamela
kāmunigariḍim̐gāni kānarādurā
būmĕla nīvāḍugonna bŏmmasāridana mĕlla
pāmiḍigŏllĕdalaṁde pachchiderīm̐ badarā

(||aṁdu||)
niggulamunuladoḍa nīsadivevedamulu
siggula kŏṭṭam̐gŏnala sem̐gaderīrā
daggaride nīgum̐ bĕddadanamudo pūjalĕlla
āggabuvĕnnamuchchimiyaṁdu sūbīm̐ badarā

(||aṁdu||)
sakkam̐gā nīdŏḍḍarājasabudŏradanamĕlla
takki nāvubarisuradame sūbīrā
akkarai śhrīveṁkaḍeśha āyamaṁṭi kūḍidivi
dikkula nemisesinā devum̐ḍa vanerā