Amdugemi dosamaa avunayya

అందుకేమి దోసమా అవునయ్య
Language

(॥పల్లవి॥)
అందుకేమి దోసమా అవునయ్య
యెందును రాజులకుఁ దప్పేడ లేదయ్యా

(॥అందు॥)
యేకతము నీతో నాడి యెదుట నిలుచున్నది
చేకొని ఆపెకు బుద్దిచెప్పవయ్యా
ఆకడి పరాకయ్యేవు అండ నే మున్నారమని
యీకడ వండివార్చి దొమ్మిఁక నేలయ్యా

(॥అందు॥)
సన్నలు నీతోఁ జేసి సరసములాడీని
వున్నతి నాపెకు లోనై వుండవయ్యా
తిన్ననిసిగ్గువడేవు దిష్టించి మామోము చూచి
అన్నిటా గరిడి చొచ్చి అడఁగనేలయ్యా

(॥అందు॥)
సెలవుల నవ్వు నవ్వి శిరసు వంచుకున్నది
మలసి సందేహము మానుపవయ్యా
అలరి శ్రీవేంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
ఫలము చేకొన్నమీఁదఁ బదరనేలయ్యా

(||pallavi||)
aṁdugemi dosamā avunayya
yĕṁdunu rājulagum̐ dappeḍa ledayyā

(||aṁdu||)
yegadamu nīdo nāḍi yĕduḍa nilusunnadi
segŏni ābĕgu buddisĕppavayyā
āgaḍi parāgayyevu aṁḍa ne munnāramani
yīgaḍa vaṁḍivārsi dŏmmim̐ka nelayyā

(||aṁdu||)
sannalu nīdom̐ jesi sarasamulāḍīni
vunnadi nābĕgu lonai vuṁḍavayyā
tinnanisigguvaḍevu diṣhṭiṁchi māmomu sūsi
anniḍā gariḍi sŏchchi aḍam̐ganelayyā

(||aṁdu||)
sĕlavula navvu navvi śhirasu vaṁchugunnadi
malasi saṁdehamu mānubavayyā
alari śhrīveṁkaḍeśha aṭṭĕ nannum̐ gūḍidivi
phalamu segŏnnamīm̐dam̐ badaranelayyā