అందుకేమి దోసమా అవుఁగాదనే వారెవ్వరు
(॥పల్లవి॥)
అందుకేమి దోసమా అవుఁగాదనే వారెవ్వరు
చెంది మాతో బాసలేల సేసేవు నీవు
(॥అందు॥)
చెలరేఁగి చెలరేఁగి చెలి నీతో నవ్వఁగాను
మెలుపున నంతలోనే మెచ్చవా నీవు
చలపట్టి యప్పటిని సరసములాడఁగాను
వెలయఁ జేయాపెమీఁద వేయవా నీవు
(॥అందు॥)
సారెకును సారెకును చన్నుల నిన్నొరయఁగా
నేరుపుతో వలపులు నించవా నీవు
ఆరీతినే కొనగోర నాయములు ముట్టఁగాను
కోరి పచ్చడము గప్పి కూడవా నీవు
(॥అందు॥)
తతిగొని తతిగొని తగనాకె మొక్కఁ గాను
ఇతవుగా దీవెనలియ్యవా నీవు
సతమై శ్రీవేంకటేశ సరి నన్ను నేలితివి
మతకములెల్ల మాని మన్నించవా నీవు
(||pallavi||)
aṁdugemi dosamā avum̐gādane vārĕvvaru
sĕṁdi mādo bāsalela sesevu nīvu
(||aṁdu||)
sĕlarem̐gi sĕlarem̐gi sĕli nīdo navvam̐gānu
mĕlubuna naṁtalone mĕchchavā nīvu
salabaṭṭi yappaḍini sarasamulāḍam̐gānu
vĕlayam̐ jeyābĕmīm̐da veyavā nīvu
(||aṁdu||)
sārĕgunu sārĕgunu sannula ninnŏrayam̐gā
nerubudo valabulu niṁchavā nīvu
ārīdine kŏnagora nāyamulu muṭṭam̐gānu
kori pachchaḍamu gappi kūḍavā nīvu
(||aṁdu||)
tadigŏni tadigŏni taganāgĕ mŏkkam̐ gānu
idavugā dīvĕnaliyyavā nīvu
sadamai śhrīveṁkaḍeśha sari nannu nelidivi
madagamulĕlla māni manniṁchavā nīvu