అందుకేమి దోసమా అట్టే కానిమ్మనవయ్య
(॥పల్లవి॥)
అందుకేమి దోసమా అట్టే కానిమ్మనవయ్య
చెంది మా మొగము చూచి సిగ్గువడ నేఁటికి
(॥॥)
నెలకొని నీవెంతేసి నేమస్తుఁడ వైనాను
వలచి వచ్చినదాని వద్దనఁగవచ్చునా
తొలుత నీవెంత గుట్టుతోడివాఁడ వైనాను
కలకల నవ్వేదానిఁ గడపఁగఁగలవా
(॥॥)
పట్టపుదొరలై యెంతపంతగాఁడ వై నాను
చుట్టిమై వచ్చినదానిఁ దట్టి తోయవచ్చునా
గట్టిగా పెక్కుచెలులు గలవాఁడ వై నాను
వెట్టికి వచ్చినదాని విడువఁగఁగలవా
(॥॥)
వుడివోని శ్రీసతి వురమెంత యెక్కినాను
తొడపై నెక్కినదానిఁ దోయఁగ వచ్చునా
కడఁగి శ్రీవేంకటేశ కలసితి విటు నన్ను
వొడివట్టిన సతితో నోప వనఁగలవా
(||pallavi||)
aṁdugemi dosamā aṭṭe kānimmanavayya
sĕṁdi mā mŏgamu sūsi sigguvaḍa nem̐ṭigi
(||||)
nĕlagŏni nīvĕṁtesi nemastum̐ḍa vainānu
valasi vachchinadāni vaddanam̐gavachchunā
tŏluda nīvĕṁta guṭṭudoḍivām̐ḍa vainānu
kalagala navvedānim̐ gaḍabam̐gam̐galavā
(||||)
paṭṭabudŏralai yĕṁtabaṁtagām̐ḍa vai nānu
suṭṭimai vachchinadānim̐ daṭṭi toyavachchunā
gaṭṭigā pĕkkusĕlulu galavām̐ḍa vai nānu
vĕṭṭigi vachchinadāni viḍuvam̐gam̐galavā
(||||)
vuḍivoni śhrīsadi vuramĕṁta yĕkkinānu
tŏḍabai nĕkkinadānim̐ doyam̐ga vachchunā
kaḍam̐gi śhrīveṁkaḍeśha kalasidi viḍu nannu
vŏḍivaṭṭina sadido noba vanam̐galavā