అందుకేమి దోసమా అట్టే కానీ కానీవయ్య
(॥పల్లవి॥)
అందుకేమి దోసమా అట్టే కానీ కానీవయ్య
చెండి యీపెతోడ నేము చెప్పకుండేమా
(॥అందు॥)
పైపై యీపెకు నిట్టె బత్తులెల్లఁ జేసేవు
చూపులఁదప్పక ఆపెఁ జూడవా నీవు
యీపోద్దే అన్నియును బయిటవేయరాదుగాక
తీపు నీగుణా లందరుఁ దెలియనివా
(॥అందు॥)
వంకలొత్తి యీపెతోను వట్టిబాసలు సేసేవు
అంకెమాట లాపెతోడ నాడవా తొల్లి
బింకాన మీలో వాదులు పెట్టి దోసమనికాక
ఇంకా మామరఁగువాఁడ వెఱఁగవా నీవు
(॥అందు॥)
ఇట్టె కాఁగిలించి యీపె నిక్కువకుఁ దీసేవు
గుట్టున నిట్లా నాపెఁ గూడవా ముందు
నట్టినడుమఁ గూడితి నన్ను శ్రీవేంకటేశ
రట్టు నిన్నుఁ జేసేనా నెట్టుకొనెఁ బనులు
(||pallavi||)
aṁdugemi dosamā aṭṭe kānī kānīvayya
sĕṁḍi yībĕdoḍa nemu sĕppaguṁḍemā
(||aṁdu||)
paibai yībĕgu niṭṭĕ battulĕllam̐ jesevu
sūbulam̐dappaga ābĕm̐ jūḍavā nīvu
yībodde anniyunu bayiḍaveyarādugāga
tību nīguṇā laṁdarum̐ dĕliyanivā
(||aṁdu||)
vaṁkalŏtti yībĕdonu vaṭṭibāsalu sesevu
aṁkĕmāḍa lābĕdoḍa nāḍavā tŏlli
biṁkāna mīlo vādulu pĕṭṭi dosamanigāga
iṁkā māmaram̐guvām̐ḍa vĕṟam̐gavā nīvu
(||aṁdu||)
iṭṭĕ kām̐giliṁchi yībĕ nikkuvagum̐ dīsevu
guṭṭuna niṭlā nābĕm̐ gūḍavā muṁdu
naṭṭinaḍumam̐ gūḍidi nannu śhrīveṁkaḍeśha
raṭṭu ninnum̐ jesenā nĕṭṭugŏnĕm̐ banulu