Amdugemi dosamaa anniyu ne neṟamganaa

అందుకేమి దోసమా అన్నియు నే నెఱఁగనా
Language

(॥పల్లవి॥)
అందుకేమి దోసమా అన్నియు నే నెఱఁగనా
చెందివున్నదాన నెట్టుసేసినాఁ జేయవయ్యా

(॥అందు॥)
పిలిచితేనే పతులు పెనఁగఁగఃజూతురు
అలిగితే మొక్కుదురు అతివలకు
కలయఁగ జూచితేనుకడుఁ గిందుపరతురు
చలము సాదించితేను చనవిత్తురు

(॥అందు॥)
నగితేనే సారాసారె నాలిసేయఁజూతురు
పగచాటితే నట్టె పైకొందురు
తగుల మాటాడితేను తప్పు లెంచఁజూతురు
మొగము చూచి తిట్టితే మోహింతురు

(॥అందు॥)
వలపు పైఁజల్లితేను పట్టారడిఁ బెట్టుదురు
అలరి సిగ్గున నుంటే సగింతురు
కలసితి విటు నన్ను గక్కన శ్రీవేంకటేశ
యిలలో మనపొందుల కిందరునుమెత్తరు

(||pallavi||)
aṁdugemi dosamā anniyu ne nĕṟam̐ganā
sĕṁdivunnadāna nĕṭṭusesinām̐ jeyavayyā

(||aṁdu||)
pilisidene padulu pĕnam̐gam̐gaḥjūduru
aligide mŏkkuduru adivalagu
kalayam̐ga jūsidenugaḍum̐ giṁdubaraduru
salamu sādiṁchidenu sanavitturu

(||aṁdu||)
nagidene sārāsārĕ nāliseyam̐jūduru
pagasāḍide naṭṭĕ paigŏṁduru
tagula māḍāḍidenu tappu lĕṁcham̐jūduru
mŏgamu sūsi tiṭṭide mohiṁturu

(||aṁdu||)
valabu paim̐jallidenu paṭṭāraḍim̐ bĕṭṭuduru
alari sigguna nuṁṭe sagiṁturu
kalasidi viḍu nannu gakkana śhrīveṁkaḍeśha
yilalo manabŏṁdula kiṁdarunumĕttaru