అందుకేమి దోసమా అన్నిటా దొరవు నీవు
(॥పల్లవి॥)
అందుకేమి దోసమా అన్నిటా దొరవు నీవు
సందడి నీవేఁటికి నిజాలు నెరపేవు
(॥॥)
నెలకొన్న మాటలకు నీవే గురిగాక
చెలులకేమివోదు చెప్పివారింతే
వెలయ నీవననివి వీరాడఁ గలరా
యెలమి నీ వానలెల్ల యేల పెట్టుకొనేవు
(॥॥)
దినము నీ చేతలకు దేహమె గురి గాక
వనిత లెఱుగుదురా వద్దివా రింతే
మును నీవు సేయనివి ముట్టి సేయించేరా వీరు
ఘనముగ నేల తారుకాణించ వచ్చేవు
(॥॥)
మంతనవు గూటమికి మనసే గురి గాక
యింతులేమిటివారు నీ యిచ్చవారింతే
యింతలో శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టే
పంతగాఁడ యాల వొడఁబరచ వచ్చేవు
(||pallavi||)
aṁdugemi dosamā anniḍā dŏravu nīvu
saṁdaḍi nīvem̐ṭigi nijālu nĕrabevu
(||||)
nĕlagŏnna māḍalagu nīve gurigāga
sĕlulagemivodu sĕppivāriṁte
vĕlaya nīvananivi vīrāḍam̐ galarā
yĕlami nī vānalĕlla yela pĕṭṭugŏnevu
(||||)
dinamu nī sedalagu dehamĕ guri gāga
vanida lĕṟugudurā vaddivā riṁte
munu nīvu seyanivi muṭṭi seyiṁcherā vīru
ghanamuga nela tārugāṇiṁcha vachchevu
(||||)
maṁtanavu gūḍamigi manase guri gāga
yiṁtulemiḍivāru nī yichchavāriṁte
yiṁtalo śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭe
paṁtagām̐ḍa yāla vŏḍam̐barasa vachchevu