అందుకేమి దోసమా అన్ని పనులునుఁ దేరీ
(॥పల్లవి॥)
అందుకేమి దోసమా అన్ని పనులునుఁ దేరీ
చెందుచు నాచేఁతలెల్లాఁ జేసి చూపె నిఁకను
(॥అందు॥)
పానుపు పైఁ బవళించి పాదాలు నాపైఁ జాఁచి
మానలేక సతితోడ మాటలాడేవు
కానీరా నీతలపులు కానవచ్చె నాకు నేఁడు
నేనాపెఁ జెనకకుండా నెపము చేసితివి
(॥అందు॥)
కోరి పచ్చడము గప్పి కుచములు నావి వట్టి
నారుకొన కాంతతోడ నవ్వు నవ్వేవు
నేరుతువౌరా మేలు నే నాపె దడవకుండా
వూరటగా నిదియొక వుపమ చేసితివి
(॥అందు॥)
తెరలోననే వుండి తియ్యని నామోవి యాని
గరిమతో నంగనను కాఁగిలించేవు
యిరవై శ్రీ వేంకటేశ యే నాపెఁ గారించకుండా
సరవితో నిటువంటి చందము చేసితివి
(||pallavi||)
aṁdugemi dosamā anni panulunum̐ derī
sĕṁdusu nāsem̐talĕllām̐ jesi sūbĕ nim̐kanu
(||aṁdu||)
pānubu paim̐ bavaḽiṁchi pādālu nābaim̐ jām̐si
mānalega sadidoḍa māḍalāḍevu
kānīrā nīdalabulu kānavachchĕ nāgu nem̐ḍu
nenābĕm̐ jĕnagaguṁḍā nĕbamu sesidivi
(||aṁdu||)
kori pachchaḍamu gappi kusamulu nāvi vaṭṭi
nārugŏna kāṁtadoḍa navvu navvevu
neruduvaurā melu ne nābĕ daḍavaguṁḍā
vūraḍagā nidiyŏga vubama sesidivi
(||aṁdu||)
tĕralonane vuṁḍi tiyyani nāmovi yāni
garimado naṁgananu kām̐giliṁchevu
yiravai śhrī veṁkaḍeśha ye nābĕm̐ gāriṁchaguṁḍā
saravido niḍuvaṁṭi saṁdamu sesidivi