అందుకేమి దోసమా అందరికీఁ గలదే
(॥పల్లవి॥)
అందుకేమి దోసమా అందరికీఁ గలదే
చెంది నన్నుఁజూచి యేల సిగ్గువడేవిపుడు
(॥అందుకేమి॥)
కలలోని మాటలెల్ల కలికి నీతోఁజెప్పఁగ
కల విరిచితివిట్టే కద్దో లేదో
తలుపుమాటుననుండి తప్పక వింటి నేను
యెలమి నాతో నీ సుద్దులేల దాఁచేవిపుడు
(॥అందుకేమి॥)
కోరినకోరికలెల్లఁ గొమ్మ విన్నవించఁగా
గారవించియ్యకొంటివి కద్దో లేదో
చేరి తెరమాటునను చెవులార వింటి నేను
యీరీతి నీకతలెల్ల నేల దాఁచేవిపుడు
(॥అందుకేమి॥)
రతులలో ముచ్చటలు రమణి యాడుకోఁగా
గతిఁ గూడ మెచ్చితివి కద్దో లేదో
తతి శ్రీ వేంకటేశ నీదండనుండి వింటి నేను
యితవై నన్నేలితివి యేల దాఁచేవిపుడు
(||pallavi||)
aṁdugemi dosamā aṁdarigīm̐ galade
sĕṁdi nannum̐jūsi yela sigguvaḍevibuḍu
(||aṁdugemi||)
kalaloni māḍalĕlla kaligi nīdom̐jĕppam̐ga
kala virisidiviṭṭe kaddo ledo
talubumāḍunanuṁḍi tappaga viṁṭi nenu
yĕlami nādo nī suddulela dām̐sevibuḍu
(||aṁdugemi||)
korinagorigalĕllam̐ gŏmma vinnaviṁcham̐gā
gāraviṁchiyyagŏṁṭivi kaddo ledo
seri tĕramāḍunanu sĕvulāra viṁṭi nenu
yīrīdi nīgadalĕlla nela dām̐sevibuḍu
(||aṁdugemi||)
radulalo muchchaḍalu ramaṇi yāḍugom̐gā
gadim̐ gūḍa mĕchchidivi kaddo ledo
tadi śhrī veṁkaḍeśha nīdaṁḍanuṁḍi viṁṭi nenu
yidavai nannelidivi yela dām̐sevibuḍu