అందుకేమి దోసమా అటువంటివాఁడవా
(॥పల్లవి॥)
అందుకేమి దోసమా అటువంటివాఁడవా
నిందలేని నీమీఁద నించవద్దా మోహము
(॥అందు॥)
తగవు నీవు చెప్పఁగా తప్పు లందు లేకుండఁగా
నగరాదా నీతోను నయముగాను
మొగము నీవుచూడఁగ మొక్కులు చేత నుండఁగ
చిగురుఁబెదవులెత్తి చెప్పరాదా ప్రియము
(॥అందు॥)
కప్పురము నీ వియ్యఁగా కాయమెల్లఁ జల్లఁగాఁగా
ముప్పిరి మెచ్చఁగ వద్దా ముందు ముందే
కొప్పు నీవు దువ్వఁగాను కొంగు చేతఁ బట్టఁగాను
నెప్పున సిగ్గులు నీపై నించరాదా నాకును
(॥అందు॥)
విడెము చేతికియ్యఁగా వేడుకఁ గాఁగిలించఁగా
కూడవద్దా నిన్ను నేను కొఱతదీర
జోడై నీ వుండఁగాను చొక్కఁగా శ్రీవేంకటేశ
వూడిగాలుసేసి వొద్దనుండరాదా ఇఁకను
(||pallavi||)
aṁdugemi dosamā aḍuvaṁṭivām̐ḍavā
niṁdaleni nīmīm̐da niṁchavaddā mohamu
(||aṁdu||)
tagavu nīvu sĕppam̐gā tappu laṁdu leguṁḍam̐gā
nagarādā nīdonu nayamugānu
mŏgamu nīvusūḍam̐ga mŏkkulu seda nuṁḍam̐ga
sigurum̐bĕdavulĕtti sĕpparādā priyamu
(||aṁdu||)
kappuramu nī viyyam̐gā kāyamĕllam̐ jallam̐gām̐gā
muppiri mĕchcham̐ga vaddā muṁdu muṁde
kŏppu nīvu duvvam̐gānu kŏṁgu sedam̐ baṭṭam̐gānu
nĕppuna siggulu nībai niṁcharādā nāgunu
(||aṁdu||)
viḍĕmu sedigiyyam̐gā veḍugam̐ gām̐giliṁcham̐gā
kūḍavaddā ninnu nenu kŏṟadadīra
joḍai nī vuṁḍam̐gānu sŏkkam̐gā śhrīveṁkaḍeśha
vūḍigālusesi vŏddanuṁḍarādā im̐kanu