అందుకేమి దోసమా ఆతఁడదె నే నిదె
(॥పల్లవి॥)
అందుకేమి దోసమా ఆతఁడదె నే నిదె
ముందు వెనకలైతే మొక్కే గాని
(॥అందు॥)
అప్పుడే ఆతడు నవ్వె ఆయము నాకు గరఁగె
చెప్పరాదా మీమాట సేసే గాని
దప్పికి యెండ మావులు తనివి దీరుచలేవు
వుప్పఁ గప్పురము లైతే వొడబడే గాని
(॥అందు॥)
కన్నుల నాతండు చూచె కాయమెల్లాఁ జల్లనాయ
పన్నరాదా మీ నేరేపు పలికేఁ గాని
వెన్నెల గాదెఁ బోసితే వెచ్చాన కడవు గాదు
సున్నమే వెన్న యైతే సూట్టిడేఁ గాని
(॥అందు॥)
శ్రీవేంకటేశుడు గూడె చేతికి లోనైతి నేను
వావి చెప్పరాదా మీరు వచ్చేఁగాని
పూవు గట్టిన జవ్వాది పూసితే వాసన వోదు
దీవిసంకు ముత్యమైతే తెలిసే గాని
(||pallavi||)
aṁdugemi dosamā ādam̐ḍadĕ ne nidĕ
muṁdu vĕnagalaide mŏkke gāni
(||aṁdu||)
appuḍe ādaḍu navvĕ āyamu nāgu garam̐gĕ
sĕpparādā mīmāḍa sese gāni
dappigi yĕṁḍa māvulu tanivi dīrusalevu
vuppam̐ gappuramu laide vŏḍabaḍe gāni
(||aṁdu||)
kannula nādaṁḍu sūsĕ kāyamĕllām̐ jallanāya
pannarādā mī nerebu paligem̐ gāni
vĕnnĕla gādĕm̐ boside vĕchchāna kaḍavu gādu
sunname vĕnna yaide sūṭṭiḍem̐ gāni
(||aṁdu||)
śhrīveṁkaḍeśhuḍu gūḍĕ sedigi lonaidi nenu
vāvi sĕpparādā mīru vachchem̐gāni
pūvu gaṭṭina javvādi pūside vāsana vodu
dīvisaṁku mutyamaide tĕlise gāni