Amdugemechchavaddaa adiva neevu

అందుకేమెచ్చవద్దా అతివ నీవు
Language

(॥పల్లవి॥)
అందుకేమెచ్చవద్దా అతివ నీవు
పొందెఱిఁగినవానితోఁ బోర మరి తగవా

(॥అందు॥)
పిలిచినప్పుడే వచ్చెపెనఁగితే లోనాయ
చలమేల సాదించేవే సరసునివి
వెలి నెంత సేసినాను వేళ దప్పనియ్యఁదు
తలఁపులోనున్న వాని తప్పులెంచఁదగవా

(॥అందు॥)
నవ్వినప్పుడేనవ్వె ననుపున మెచ్చఁజేసె
రవ్వలే సేసేవే రమణునిని
యెవ్వతెఁ బెండ్లాడినాను యిరవునీనగరే
వువ్విళ్లూరించేవారి నొద్దనఁగఁదగవా

(॥అందు॥)
కూడినప్పుడే కూడెను కూరిమికి సంతోసించె
వీడనేలాడేవే శ్రీవేంకటేశుని
వీడె మెవ్వతిచ్చినాను విడువఁడు నీకాఁగిలి
జోడయి వుండినవాని సోదించఁగవా

(||pallavi||)
aṁdugemĕchchavaddā adiva nīvu
pŏṁdĕṟim̐ginavānidom̐ bora mari tagavā

(||aṁdu||)
pilisinappuḍe vachchĕbĕnam̐gide lonāya
salamela sādiṁcheve sarasunivi
vĕli nĕṁta sesinānu veḽa dappaniyyam̐du
talam̐pulonunna vāni tappulĕṁcham̐dagavā

(||aṁdu||)
navvinappuḍenavvĕ nanubuna mĕchcham̐jesĕ
ravvale seseve ramaṇunini
yĕvvadĕm̐ bĕṁḍlāḍinānu yiravunīnagare
vuvviḽlūriṁchevāri nŏddanam̐gam̐dagavā

(||aṁdu||)
kūḍinappuḍe kūḍĕnu kūrimigi saṁtosiṁchĕ
vīḍanelāḍeve śhrīveṁkaḍeśhuni
vīḍĕ mĕvvadichchinānu viḍuvam̐ḍu nīgām̐gili
joḍayi vuṁḍinavāni sodiṁcham̐gavā