Amdugeme naasamtosa madiyegaadaa

అందుకేమే నాసంతోస మదియేకాదా
Language

(॥పల్లవి॥)
అందుకేమే నాసంతోస మదియేకాదా
కందువల నన్ను నిట్టె కరుణించుమనవే

(॥అందు॥)
ఇంతవడి నన్నె చూచె యేమినోము నోచితినో
వింతలేల మాయింటికి విచ్చేయనీవే
యెంతేసి వేఁడుకొనీనే యెదురాడేనా నేను
అంతేపో వోయమ్మ అడుగఁగవలెనా

(॥అందు॥)
వేడుకైతేఁ జాలుఁగాక విచారమేల నాచేత
వూడిగము సేయించుకవుండుమనవే
వీడె మందుకోనీవే వేరేల తనవారమే
చూడవో చేసుకొంటేను చుట్టరికముగాదా

(॥అందు॥)
అడియాల మంపెఁగాను అంత నేను బాఁతియైతే
యెడమాట లిఁకనేల యేలుమనవే
బడినే శ్రీవేంకటపతి దానె వచ్చి కూడె
కడమ లేదే మన్నించె కమ్మటి మెచ్చీని

(||pallavi||)
aṁdugeme nāsaṁtosa madiyegādā
kaṁduvala nannu niṭṭĕ karuṇiṁchumanave

(||aṁdu||)
iṁtavaḍi nannĕ sūsĕ yeminomu nosidino
viṁtalela māyiṁṭigi vichcheyanīve
yĕṁtesi vem̐ḍugŏnīne yĕdurāḍenā nenu
aṁtebo voyamma aḍugam̐gavalĕnā

(||aṁdu||)
veḍugaidem̐ jālum̐gāga visāramela nāseda
vūḍigamu seyiṁchugavuṁḍumanave
vīḍĕ maṁdugonīve verela tanavārame
sūḍavo sesugŏṁṭenu suṭṭarigamugādā

(||aṁdu||)
aḍiyāla maṁpĕm̐gānu aṁta nenu bām̐tiyaide
yĕḍamāḍa lim̐kanela yelumanave
baḍine śhrīveṁkaḍabadi dānĕ vachchi kūḍĕ
kaḍama lede manniṁchĕ kammaḍi mĕchchīni