అందుకేమే మంచిమాట లాడితేను దోసమా
(॥పల్లవి॥)
అందుకేమే మంచిమాట లాడితేను దోసమా
యిందరి లోపల నన్ను నేలేవాఁడు గాఁడా
(॥॥)
ఇట్టు నట్టు వేఁడుక నన్నేల వొడఁబరచేరే
వట్టి మాట లిడ నేల వచ్చీఁగా తాను
చుట్టమైన దాన నేను సూడు వట్టేనా తన్ను
గట్టిగా నా పాలిటఁ గలఁడుగా తాను
(॥॥)
పొద్దున నాతని కిట్టే బోనము సేయు మనేరు
వద్దనేనా అందుకేమి వచ్చీఁగా తాను
కొద్ది మీఱ వీడె మంపె కొమ్మని చేతికిచ్చేరు
పెద్దరిక మింత సేసి పెనఁగీఁగా తాను
(॥॥)
అన్నిటా నలుక దీర్చి ఆనవెట్టించుకొంటిరి
వన్నెల నా కౌఁగిటికి వచ్చీఁగా తాను
యెన్నఁగ శ్రీ వేంకటేశుఁడింతలోనే వచ్చి కూడె
నిన్ననే మెచ్చితి నింత నేర్చుఁగా తాను
(||pallavi||)
aṁdugeme maṁchimāḍa lāḍidenu dosamā
yiṁdari lobala nannu nelevām̐ḍu gām̐ḍā
(||||)
iṭṭu naṭṭu vem̐ḍuga nannela vŏḍam̐barasere
vaṭṭi māḍa liḍa nela vachchīm̐gā tānu
suṭṭamaina dāna nenu sūḍu vaṭṭenā tannu
gaṭṭigā nā pāliḍam̐ galam̐ḍugā tānu
(||||)
pŏdduna nādani kiṭṭe bonamu seyu maneru
vaddanenā aṁdugemi vachchīm̐gā tānu
kŏddi mīṟa vīḍĕ maṁpĕ kŏmmani sedigichcheru
pĕddariga miṁta sesi pĕnam̐gīm̐gā tānu
(||||)
anniḍā naluga dīrsi ānavĕṭṭiṁchugŏṁṭiri
vannĕla nā kaum̐giḍigi vachchīm̐gā tānu
yĕnnam̐ga śhrī veṁkaḍeśhum̐ḍiṁtalone vachchi kūḍĕ
ninnane mĕchchidi niṁta nersum̐gā tānu