అందుకే యెదురు చూచీ నాకె నీమోము
(॥పల్లవి॥)
అందుకే యెదురు చూచీ నాకె నీమోము
మందలించి మీలో పని మాకెల్ల దెలుసుఁగా
(॥అందు॥)
చిప్పిలఁగఁ జెమరించి సిగ్గువడీఁ జెలి యదె
చెప్పరాని మాఁట లేమి చెప్పితివో
నెప్పున నీ సేఁత లెల్ల నీవే తీరుచవలె
తప్పి నే మెల్లాను తగవు చెప్పఁగలమా
(॥అందు॥)
కాయమెల్లఁ బులకించి కాఁగిలించుకొనెఁ జెలి
ఆయము లెక్కడ నీవు అంటితివో
చాయ నీవే చూపినవి చక్కఁబెట్టవలె నీవే
చేయివట్టి నేము నిన్ను చిమ్మిరేఁచేమా
(॥అందు॥)
కొంగువట్టి నిన్నుఁ దీసి గొబ్బున నెనసెఁ జెలి
యింగితాన నెంత చనవిచ్చితివో
రంగు శ్రీ వేంకటేశ నీరతులు నీకే చెల్లు
సంగతి నేమెల్లా యివి సాదించేమా
(||pallavi||)
aṁduge yĕduru sūsī nāgĕ nīmomu
maṁdaliṁchi mīlo pani māgĕlla dĕlusum̐gā
(||aṁdu||)
sippilam̐gam̐ jĕmariṁchi sigguvaḍīm̐ jĕli yadĕ
sĕpparāni mām̐ṭa lemi sĕppidivo
nĕppuna nī sem̐ta lĕlla nīve tīrusavalĕ
tappi ne mĕllānu tagavu sĕppam̐galamā
(||aṁdu||)
kāyamĕllam̐ bulagiṁchi kām̐giliṁchugŏnĕm̐ jĕli
āyamu lĕkkaḍa nīvu aṁṭidivo
sāya nīve sūbinavi sakkam̐bĕṭṭavalĕ nīve
seyivaṭṭi nemu ninnu simmirem̐semā
(||aṁdu||)
kŏṁguvaṭṭi ninnum̐ dīsi gŏbbuna nĕnasĕm̐ jĕli
yiṁgidāna nĕṁta sanavichchidivo
raṁgu śhrī veṁkaḍeśha nīradulu nīge sĕllu
saṁgadi nemĕllā yivi sādiṁchemā