Amduge vo seliyaa arudayyee naagu nitte

అందుకే వో చెలియా అరుదయ్యీ నాకు నిట్టే
Language

(॥పల్లవి॥)
అందుకే వో చెలియా అరుదయ్యీ నాకు నిట్టే
చందమాయఁ బను లెల్లా సంతోసమా నీకు

(॥॥)
ఆనుకొని చెలులచే ఆతఁడు సేసేచేఁత
వీనుల పండుగ గాను వింటివా నీవు
వూనిన వేడుక తోడ నుండేటి లాగు లెల్ల
కానుకగాఁ గన్నులారఁ గంటివా నీవు

(॥॥)
ఆరి తేరి వద్ద నుండి యాతని తలఁపు లెల్లా
చేరి మాటలాడి తెలిసితివా నీవు
నారుకొనే నప్పటి నీ నయగారితనములు
మేరమీఱి పచారించి మెచ్చితివా నీవు

(॥॥)
మెఱయ శ్రీ వేంకటేశు మేలిమినేరుపు లెల్లా
గుఱిగాఁ గౌఁగిటిలోఁ జేకొంటివా నీవూ
మఱియును నలమేలుమంగ నైన నన్నుఁ గూడె
తెఱవలలోన సమ్మతించితివా నీవు

(||pallavi||)
aṁduge vo sĕliyā arudayyī nāgu niṭṭe
saṁdamāyam̐ banu lĕllā saṁtosamā nīgu

(||||)
ānugŏni sĕlulase ādam̐ḍu sesesem̐ta
vīnula paṁḍuga gānu viṁṭivā nīvu
vūnina veḍuga toḍa nuṁḍeḍi lāgu lĕlla
kānugagām̐ gannulāram̐ gaṁṭivā nīvu

(||||)
āri teri vadda nuṁḍi yādani talam̐pu lĕllā
seri māḍalāḍi tĕlisidivā nīvu
nārugŏne nappaḍi nī nayagāridanamulu
meramīṟi pasāriṁchi mĕchchidivā nīvu

(||||)
mĕṟaya śhrī veṁkaḍeśhu meliminerubu lĕllā
guṟigām̐ gaum̐giḍilom̐ jegŏṁṭivā nīvū
maṟiyunu nalamelumaṁga naina nannum̐ gūḍĕ
tĕṟavalalona sammadiṁchidivā nīvu