Amduge visaarimche naadamdu naa praanamu

అందుకే విచారించే నాతఁడు నా ప్రాణము
Language

(॥పల్లవి॥)
అందుకే విచారించే నాతఁడు నా ప్రాణము
చెంది నా వలపు లైతేఁ జిమ్మి రేఁచీఁ జెలియా

(॥॥)
కాటుక కన్నులఁ జూడఁగా నవి నాటవు గదా
మేటియైన కోమలపు మేను తనది
మాటలు సారె నాడఁగా మర్మాలు దాఁకవు గదా
కూటువైన దయ గల గుణములు తనవి

(॥॥)
కడు మచ్చిక చూపఁగాఁ గమ్మి కరఁగదు గదా
నడుమను మెత్తని మనసు తనది
జడియఁ గౌఁగిలించఁ గాఁ జన్ను లొత్తవు గదా
వుడివోని యట్టి పురుషొ త్తముఁడు తాను

(॥॥)
యెదుట నుండఁగా నాపై యీ పరాకే కాదుగదా
తుద భక్తవత్సల బిరుదు తనది
యిదె నన్నేలె శ్రీ వేంకటేశుఁ డలయఁడు గదా
కదిసి చెప్ప రాని చక్కఁదనము తనది

(||pallavi||)
aṁduge visāriṁche nādam̐ḍu nā prāṇamu
sĕṁdi nā valabu laidem̐ jimmi rem̐sīm̐ jĕliyā

(||||)
kāḍuga kannulam̐ jūḍam̐gā navi nāḍavu gadā
meḍiyaina komalabu menu tanadi
māḍalu sārĕ nāḍam̐gā marmālu dām̐kavu gadā
kūḍuvaina daya gala guṇamulu tanavi

(||||)
kaḍu machchiga sūbam̐gām̐ gammi karam̐gadu gadā
naḍumanu mĕttani manasu tanadi
jaḍiyam̐ gaum̐giliṁcham̐ gām̐ jannu lŏttavu gadā
vuḍivoni yaṭṭi puruṣhŏ ttamum̐ḍu tānu

(||||)
yĕduḍa nuṁḍam̐gā nābai yī parāge kādugadā
tuda bhaktavatsala birudu tanadi
yidĕ nannelĕ śhrī veṁkaḍeśhum̐ ḍalayam̐ḍu gadā
kadisi sĕppa rāni sakkam̐danamu tanadi