అందుకే వెఱఁగయ్యీని ఆహా నాకు
(॥పల్లవి॥)
అందుకే వెఱఁగయ్యీని ఆహా నాకు
విందుల నీ చేఁత లివె విచారించవయ్య
(॥అందు॥)
నిగమాంతవిదు లెల్ల నీవు పనులఁ గావఁగా
వెగటుగా నాఁడెందు వెదకిరో
జగతి యోగీశ్వరులు సరి నీవు గొల్లెతల
తగిలినవేళ నెట్టు ధ్యానము సేసిరో
(॥అందు॥)
పరమగురువు లెల్లా పాలు నీవు దొంగిలఁగా
అరసి నీమహిమ లేమని చెప్పిరో
సురలు నీవు రేపల్లెచొచ్చి పారియాడఁగాను
ఇరవై నీవెంట వెంట నెట్లా దిరిగిరో
(॥అందు॥)
కోరి మునులెల్లా నీవు గోపాళులతో నాడఁగ
సారెఁబొగడి యేమని చదువుదురో
యీరీతి శ్రీ వేంకటేశ యెదుట నీవుండఁగాను
నేరిచి నీ దాసులెల్ల నిన్నెట్లా మెచ్చిరో
(||pallavi||)
aṁduge vĕṟam̐gayyīni āhā nāgu
viṁdula nī sem̐ta livĕ visāriṁchavayya
(||aṁdu||)
nigamāṁtavidu lĕlla nīvu panulam̐ gāvam̐gā
vĕgaḍugā nām̐ḍĕṁdu vĕdagiro
jagadi yogīśhvarulu sari nīvu gŏllĕdala
tagilinaveḽa nĕṭṭu dhyānamu sesiro
(||aṁdu||)
paramaguruvu lĕllā pālu nīvu dŏṁgilam̐gā
arasi nīmahima lemani sĕppiro
suralu nīvu reballĕsŏchchi pāriyāḍam̐gānu
iravai nīvĕṁṭa vĕṁṭa nĕṭlā dirigiro
(||aṁdu||)
kori munulĕllā nīvu gobāḽulado nāḍam̐ga
sārĕm̐bŏgaḍi yemani saduvuduro
yīrīdi śhrī veṁkaḍeśha yĕduḍa nīvuṁḍam̐gānu
nerisi nī dāsulĕlla ninnĕṭlā mĕchchiro