Amduge veragayyee nappadanumdi naagu

అందుకే వెరగయ్యీ నప్పటనుండి నాకు
Language

(॥పల్లవి॥)
అందుకే వెరగయ్యీ నప్పటనుండి నాకు
సందడి నే పెండ్లాడీ సతులాల చూడరే

(॥అందు॥)
తప్పక యేమి చూచీ నే తలవంచుకుండఁగాను
చెప్పీ నేఁటివో సుద్దులు చెవిలోనను
కప్పీఁ దనపచ్చడము కడు సిగ్గయ్యీ నాకు
ఇప్పు డితఁడు వలపు లెంత రేఁచీనే

(॥అందు॥)
చెక్కు లేల నొక్కీనే సెలవి నే నవ్వఁగాను
అక్కరతోఁ గూచుండీ నండకు వచ్చి
మక్కువతోఁ జన్నులంటీ మరి సోద్యమయ్యీ నాకు
యిక్కడ నితఁడు నన్ను నెంత రట్టుసేసీనే

(॥అందు॥)
చేతు లేమి చాఁచీనే చెంగట నే నుండఁగాను
కాతరాన సేసవెట్టిఁ గమ్మి కొప్పుపై
ఆతుమారాఁ గాఁగిలించీ నట్టె వెరగయ్యీ నాకు
యీతల శ్రీవేంకటేశుఁ డెంత మన్నించీనే

(||pallavi||)
aṁduge vĕragayyī nappaḍanuṁḍi nāgu
saṁdaḍi ne pĕṁḍlāḍī sadulāla sūḍare

(||aṁdu||)
tappaga yemi sūsī ne talavaṁchuguṁḍam̐gānu
sĕppī nem̐ṭivo suddulu sĕvilonanu
kappīm̐ danabachchaḍamu kaḍu siggayyī nāgu
ippu ḍidam̐ḍu valabu lĕṁta rem̐sīne

(||aṁdu||)
sĕkku lela nŏkkīne sĕlavi ne navvam̐gānu
akkaradom̐ gūsuṁḍī naṁḍagu vachchi
makkuvadom̐ jannulaṁṭī mari sodyamayyī nāgu
yikkaḍa nidam̐ḍu nannu nĕṁta raṭṭusesīne

(||aṁdu||)
sedu lemi sām̐sīne sĕṁgaḍa ne nuṁḍam̐gānu
kādarāna sesavĕṭṭim̐ gammi kŏppubai
ādumārām̐ gām̐giliṁchī naṭṭĕ vĕragayyī nāgu
yīdala śhrīveṁkaḍeśhum̐ ḍĕṁta manniṁchīne