Amduge vera gayyeene appadanumdiyu maagu

అందుకే వెర గయ్యీనె అప్పటనుండియు మాకు
Language

(॥పల్లవి॥)
అందుకే వెర గయ్యీనె అప్పటనుండియు మాకు
అందినవారికి మిన్ను అరచేతిదే

(॥అందుకే॥)
పతిమాఁటాడ విదేమే పలుమారుఁ దమకాన
అతఁడు నీతో మాట లాడఁగాను
యిత వై యెక్కినవారి కేనుగ గుజ్జన్న మాట
కతలుగా నీయందె కంటిమే నేము

(॥అందుకే॥)
గక్కన రావది యేమె ఘనుఁడు నవ్వుతా నిన్ను
తెక్కులనె చేయి వట్టి తియ్యఁగాను
నొక్క టై పాలు వోసితే వోకివింత లన్నమాఁట
మిక్కిలి నీవల్లనె మెరసెనే నేఁడు

(॥అందుకే॥)
శ్రీవెంకటేశ్వరుఁడు చేయి నీపై వేయఁగాను
నోవ దనక వాఁడిచన్నుల నొత్తేవు
పూవులవేసినవారిఁ బొంచి రాల వేసినట్టి
భావము నీయందె కంటి భళి భళి గుణములూ

(||pallavi||)
aṁduge vĕra gayyīnĕ appaḍanuṁḍiyu māgu
aṁdinavārigi minnu arasedide

(||aṁduge||)
padimām̐ṭāḍa videme palumārum̐ damagāna
adam̐ḍu nīdo māḍa lāḍam̐gānu
yida vai yĕkkinavāri kenuga gujjanna māḍa
kadalugā nīyaṁdĕ kaṁṭime nemu

(||aṁduge||)
gakkana rāvadi yemĕ ghanum̐ḍu navvudā ninnu
tĕkkulanĕ seyi vaṭṭi tiyyam̐gānu
nŏkka ṭai pālu voside vogiviṁta lannamām̐ṭa
mikkili nīvallanĕ mĕrasĕne nem̐ḍu

(||aṁduge||)
śhrīvĕṁkaḍeśhvarum̐ḍu seyi nībai veyam̐gānu
nova danaga vām̐ḍisannula nŏttevu
pūvulavesinavārim̐ bŏṁchi rāla vesinaṭṭi
bhāvamu nīyaṁdĕ kaṁṭi bhaḽi bhaḽi guṇamulū