అందుకే చింతయ్యీని అప్పటనుండియు నాకు
(॥పల్లవి॥)
అందుకే చింతయ్యీని అప్పటనుండియు నాకు
కందువ నెదుగఁబోయి కమ్మరఁ దేవుగా
(॥॥)
పడఁతి వాని నొడఁబరచి తోడుకరావే
కడు నీనేరుపు లిందే కనుఁగొనేఁగా
వడిఁ బరాకైతినంటా వాఁడే యలగిపోయె
బడి నేఁగి నామారు పై కొని మొక్కవుగా
(॥॥)
యెంతరానన్నా వాని నీపొద్దే తోడుకరావే
యిఁతి నీవు సేసేమేలు ఇందుఁజూచేఁగా
పంత మేమోఅంటినంటా పట్టఁగా నలిగిపోయె
ఇంతలో నామారు వాని ఇంటికి నేఁగవుగా
(॥॥)
శ్రీ వేంకటేశుని నన్నుఁ జేకొని కూడించితివే
యీ వేళ నిన్ను మెచ్చే దిందువంకఁగా
పూవుల వేసితినంటాఁ బొదిగి నన్నిదె పట్టె
ఆవల నామారు నీవు అతని వేయువుగా
(||pallavi||)
aṁduge siṁtayyīni appaḍanuṁḍiyu nāgu
kaṁduva nĕdugam̐boyi kammaram̐ devugā
(||||)
paḍam̐ti vāni nŏḍam̐barasi toḍugarāve
kaḍu nīnerubu liṁde kanum̐gŏnem̐gā
vaḍim̐ barāgaidinaṁṭā vām̐ḍe yalagiboyĕ
baḍi nem̐gi nāmāru pai kŏni mŏkkavugā
(||||)
yĕṁtarānannā vāni nībŏdde toḍugarāve
yim̐ti nīvu sesemelu iṁdum̐jūsem̐gā
paṁta memoaṁṭinaṁṭā paṭṭam̐gā naligiboyĕ
iṁtalo nāmāru vāni iṁṭigi nem̐gavugā
(||||)
śhrī veṁkaḍeśhuni nannum̐ jegŏni kūḍiṁchidive
yī veḽa ninnu mĕchche diṁduvaṁkam̐gā
pūvula vesidinaṁṭām̐ bŏdigi nannidĕ paṭṭĕ
āvala nāmāru nīvu adani veyuvugā