Amduge samtosamaaya nannidaa naagu

అందుకే సంతోసమాయ నన్నిటా నాకు
Language

(॥పల్లవి॥)
అందుకే సంతోసమాయ నన్నిటా నాకు
కందువ నిట్టె మమ్ముఁ గరుణించవయ్యా

(॥అందు॥)
యెచ్చటనుండి నీవు యేమేమి సేసినాను
వచ్చితివిగా నేఁడు మా వాకిటికిని
విచ్చనవిడిని నీవు వేడుకకాఁడవై వున్నా
మచ్చికతోఁ గూచుండి మాఁటలాడితివిగా

(॥అందు॥)
కామించి నీ వెన్నెన్ని కతలఁ బొరలినాను
నామోము చూచి ఇట్టె నవ్వితిగా
వేమరు నీ చేతలు వెల్లవిరులైనాను
ఆముకొని కాఁగిలించి యాదరించితివిగా

(॥అందు॥)
ఆసలఁ జొక్కి నీ వెంత ఆయములు గరఁగినా
సేసలెట్టి పెండ్లాడి చేకొంటివిగా
నీ సుద్ది శ్రీవేంకటేశ నిండుకొని వుండినాను
వాసితో నన్నేలి నావాఁడవైతివిగా

(||pallavi||)
aṁduge saṁtosamāya nanniḍā nāgu
kaṁduva niṭṭĕ mammum̐ garuṇiṁchavayyā

(||aṁdu||)
yĕchchaḍanuṁḍi nīvu yememi sesinānu
vachchidivigā nem̐ḍu mā vāgiḍigini
vichchanaviḍini nīvu veḍugagām̐ḍavai vunnā
machchigadom̐ gūsuṁḍi mām̐ṭalāḍidivigā

(||aṁdu||)
kāmiṁchi nī vĕnnĕnni kadalam̐ bŏralinānu
nāmomu sūsi iṭṭĕ navvidigā
vemaru nī sedalu vĕllavirulainānu
āmugŏni kām̐giliṁchi yādariṁchidivigā

(||aṁdu||)
āsalam̐ jŏkki nī vĕṁta āyamulu garam̐ginā
sesalĕṭṭi pĕṁḍlāḍi segŏṁṭivigā
nī suddi śhrīveṁkaḍeśha niṁḍugŏni vuṁḍinānu
vāsido nanneli nāvām̐ḍavaidivigā