అందుకే పో యెమ్మెలంటా నాడుకొనేరు
(॥పల్లవి॥)
అందుకే పో యెమ్మెలంటా నాడుకొనేరు
సందడిలో గందవొడి చాతుకొనేవు
(॥అందు॥)
చేరలంతలుగన్నులచెలి నిన్నుఁ జూడఁగాను
తీరుగాఁ గస్తూరిబొట్టు తిద్దుకొనేవు
నేరుపుగలిగినావె నీవద్దనే వుండఁగాను
గారవించి వలపులకతలు చెప్పేవు
(॥అందు॥)
కొండలంతలు గుబ్బలకొమ్మ నిన్ను నొరయఁగా
మెండుగఁ గప్పుధూళి మెత్తుకొనేవు
నిండుసింగారాన నాపె నీతో సరసమాడఁగా
అండనే తట్టుపుణుఁగు అలఁదుకొనేవు
(॥అందు॥)
పెద్దకొప్పలమేల్మంగ పేరురమపై నుండఁగా
నిద్దపుసొమ్ములు మేన నించుకొనేవు
గద్దం శ్రీవేంకటేశ కాఁగిట నాపె గూడఁగా
కొద్దిమీర నారగించి కొలువై వుండేవు
(||pallavi||)
aṁduge po yĕmmĕlaṁṭā nāḍugŏneru
saṁdaḍilo gaṁdavŏḍi sādugŏnevu
(||aṁdu||)
seralaṁtalugannulasĕli ninnum̐ jūḍam̐gānu
tīrugām̐ gastūribŏṭṭu tiddugŏnevu
nerubugaligināvĕ nīvaddane vuṁḍam̐gānu
gāraviṁchi valabulagadalu sĕppevu
(||aṁdu||)
kŏṁḍalaṁtalu gubbalagŏmma ninnu nŏrayam̐gā
mĕṁḍugam̐ gappudhūḽi mĕttugŏnevu
niṁḍusiṁgārāna nābĕ nīdo sarasamāḍam̐gā
aṁḍane taṭṭubuṇum̐gu alam̐dugŏnevu
(||aṁdu||)
pĕddagŏppalamelmaṁga peruramabai nuṁḍam̐gā
niddabusŏmmulu mena niṁchugŏnevu
gaddaṁ śhrīveṁkaḍeśha kām̐giḍa nābĕ gūḍam̐gā
kŏddimīra nāragiṁchi kŏluvai vuṁḍevu