Amduge po veragayyee nammalaala

అందుకే పో వెరగయ్యీ నమ్మలాల
Language

(॥పల్లవి॥)
అందుకే పో వెరగయ్యీ నమ్మలాల
అందరిలో నన్నే మెచ్చినట్టే కాదా

(॥అందు॥)
వేడుకకాఁడు గదవే వీడెము చేతికిచ్చితే
ఆడకు రమ్మని తీసీ నట్టే కాదా
పాడితోడ నిందుకుఁగా పక్కన నే నవ్వితేను
ఆడరానిమాటలాడీ నట్టే కాదా

(॥అందు॥)
మోసలేని జాణగదే మొక్కినంతలోనే నన్ను
ఆసవెట్టి వెళ్లఁదీసె నట్టేకాదా
గాసికోపక సిగ్గుతోఁగదలితే వెంట వెంట
ఆసుకోనివలె వచ్చీ నట్టేకాదా

(॥అందు॥)
నేరుపరిగదె వీఁడు నేన్కొకమాటాడితేను
ఆరసి తాఁ గాఁగిలించీ నట్టేకాదా
వేరులేక యిందుకే శ్రీవేంకటేశుఁ గూడితిని
హరములు నాకు నిచ్చె నట్టే కాదా

(||pallavi||)
aṁduge po vĕragayyī nammalāla
aṁdarilo nanne mĕchchinaṭṭe kādā

(||aṁdu||)
veḍugagām̐ḍu gadave vīḍĕmu sedigichchide
āḍagu rammani tīsī naṭṭe kādā
pāḍidoḍa niṁdugum̐gā pakkana ne navvidenu
āḍarānimāḍalāḍī naṭṭe kādā

(||aṁdu||)
mosaleni jāṇagade mŏkkinaṁtalone nannu
āsavĕṭṭi vĕḽlam̐dīsĕ naṭṭegādā
gāsigobaga siggudom̐gadalide vĕṁṭa vĕṁṭa
āsugonivalĕ vachchī naṭṭegādā

(||aṁdu||)
nerubarigadĕ vīm̐ḍu nenkŏgamāḍāḍidenu
ārasi tām̐ gām̐giliṁchī naṭṭegādā
verulega yiṁduge śhrīveṁkaḍeśhum̐ gūḍidini
haramulu nāgu nichchĕ naṭṭe kādā