Amduge po simtimchee nappadinumdi

అందుకే పో చింతించీ నప్పటినుండి
Language

(॥పల్లవి॥)
అందుకే పో చింతించీ నప్పటినుండి
చెంది వేఁడుకొనవయ్యా చెలిని యీ వేళను

(॥॥)
గుట్టున నుండినదాని గోరు చంటిమీద దీసి
నట్టనడుమ నూరకే నవ్వితివట
అట్టె అదియునుగాక అలయించి యేమిటికో
ఱట్టుగా గేరడము లిట్టె యాడితివట

(॥॥)
ముప్పిరిసిగ్గరిదానిముసుగు దీసి మోమెత్తి
తప్పక చూచితివట త త్తరానను
అప్పటి వేరొకతెతో నాపెరహస్యములెల్లా
చెప్పి మోవిమీఁద గంటిసేసితివట

(॥॥)
చెలఁగి కూడినదానిచీర నీవు గట్టుకొని
యెలమిఁ బచ్చడ మాపె కిచ్చితివట
అలమేలుమంగపతివైన శ్రీవేంకటేశుఁడ
నిలువు గల్కితగాలు నేర్పితివట

(||pallavi||)
aṁduge po siṁtiṁchī nappaḍinuṁḍi
sĕṁdi vem̐ḍugŏnavayyā sĕlini yī veḽanu

(||||)
guṭṭuna nuṁḍinadāni goru saṁṭimīda dīsi
naṭṭanaḍuma nūrage navvidivaḍa
aṭṭĕ adiyunugāga alayiṁchi yemiḍigo
ṟaṭṭugā geraḍamu liṭṭĕ yāḍidivaḍa

(||||)
muppirisiggaridānimusugu dīsi momĕtti
tappaga sūsidivaḍa ta ttarānanu
appaḍi verŏgadĕdo nābĕrahasyamulĕllā
sĕppi movimīm̐da gaṁṭisesidivaḍa

(||||)
sĕlam̐gi kūḍinadānisīra nīvu gaṭṭugŏni
yĕlamim̐ bachchaḍa mābĕ kichchidivaḍa
alamelumaṁgabadivaina śhrīveṁkaḍeśhum̐ḍa
niluvu galgidagālu nerbidivaḍa