Amduge po ninnum joosi alasemu ne maide

అందుకే పో నిన్నుఁ జూచి అలసేము నే మైతే
Language

(॥పల్లవి॥)
అందుకే పో నిన్నుఁ జూచి అలసేము నే మైతే
విందుల నీ మతిలోని వేడుకెట్టిదో కాని

(॥అందుకే॥)
తనువు నిండినసిరి తరుణి నీ కుచములు
మొనసి నీకు పెద్ద మోపాయెఁ గాని
ఘనమైన నీ తురుము కప్పునీలముల కుప్ప
వెనక దిక్కునకే వేఁగాయెఁ గాని

(॥అందుకే॥)
పాయము పండినపంట పడఁతి నీ తేనెమోవి
ఆయము చిలుక వోట్లు ఆయెఁ గాని
సోయగపు నీ నడుము చుక్కలు మోచిన మిన్ను
బాయటఁ జూచిన పట్టఁ బస లేదు గాని

(॥అందుకే॥)
కాముని యమ్ములు నీ కనుసోగ లివి రెండు
కామించి మదరాగము కక్కీఁ గాని
యీమేర శ్రీవేంకటేశుఁడ నన్నుఁ గూడితి
ఆమనిరతుల నీ యాస వోదు గాని

(||pallavi||)
aṁduge po ninnum̐ jūsi alasemu ne maide
viṁdula nī madiloni veḍugĕṭṭido kāni

(||aṁduge||)
tanuvu niṁḍinasiri taruṇi nī kusamulu
mŏnasi nīgu pĕdda mobāyĕm̐ gāni
ghanamaina nī turumu kappunīlamula kuppa
vĕnaga dikkunage vem̐gāyĕm̐ gāni

(||aṁduge||)
pāyamu paṁḍinabaṁṭa paḍam̐ti nī tenĕmovi
āyamu siluga voṭlu āyĕm̐ gāni
soyagabu nī naḍumu sukkalu mosina minnu
bāyaḍam̐ jūsina paṭṭam̐ basa ledu gāni

(||aṁduge||)
kāmuni yammulu nī kanusoga livi rĕṁḍu
kāmiṁchi madarāgamu kakkīm̐ gāni
yīmera śhrīveṁkaḍeśhum̐ḍa nannum̐ gūḍidi
āmaniradula nī yāsa vodu gāni