Amduge po ninnu tooranaadidi mimdarilonaa

అందుకే పో నిన్ను తూరనాడితి మిందరిలోనా
Language

(॥పల్లవి॥)
అందుకే పో నిన్ను తూరనాడితి మిందరిలోనా
ఇందుముఖి భావ మిది ఇఁకను నీ చిత్తము

(॥అందు॥)
చిత్తము నీపై నిలిపి చెలితో ముచ్చట చెప్పి
తత్తరించి తనమాఁట తా మరచె
కొత్తగా మోవిని నవ్వి కోపమే బొమ్మల నించి
చిత్తరు పతిమవలె చేఁతలెల్లా మరచె

(॥అందు॥)
చెప్పినసుద్దులే చెప్పీ సేసినచేఁతలే సేసి
అప్ప డేమంటినోయని అడిగీఁదానె
రెప్పల తుదల సిగ్గు రేసులై నిట్టూర్పులను
దప్పిదేరేమేనితోడ తడఁబాటుఁ బొందెను

(॥అందు॥)
అంతలోనే నిన్నుఁ జూచి అంగన కన్నీరు నించి
పంతపుఁ కారిమితో నీపై నొరగెను
ఇంతసేసె కూడితివి ఇప్పుడే శ్రీవేంకటేశ
వింతగాఁ గళలఁ జొక్కి వేడుక నలసెను

(||pallavi||)
aṁduge po ninnu tūranāḍidi miṁdarilonā
iṁdumukhi bhāva midi im̐kanu nī sittamu

(||aṁdu||)
sittamu nībai nilibi sĕlido muchchaḍa sĕppi
tattariṁchi tanamām̐ṭa tā marasĕ
kŏttagā movini navvi kobame bŏmmala niṁchi
sittaru padimavalĕ sem̐talĕllā marasĕ

(||aṁdu||)
sĕppinasuddule sĕppī sesinasem̐tale sesi
appa ḍemaṁṭinoyani aḍigīm̐dānĕ
rĕppala tudala siggu resulai niṭṭūrbulanu
dappideremenidoḍa taḍam̐bāḍum̐ bŏṁdĕnu

(||aṁdu||)
aṁtalone ninnum̐ jūsi aṁgana kannīru niṁchi
paṁtabum̐ kārimido nībai nŏragĕnu
iṁtasesĕ kūḍidivi ippuḍe śhrīveṁkaḍeśha
viṁtagām̐ gaḽalam̐ jŏkki veḍuga nalasĕnu