Amduge po neevaddi kappadanumti raadu

అందుకే పో నీవద్ది కప్పటనుంటి రాదు
Language

(॥పల్లవి॥)
అందుకే పో నీవద్ది కప్పటనుంటి రాదు
కందువకే విచ్చేసి కైకొనుమీ చెలిని

(॥అందు॥)
యేకతమాడేనంటా నింతి దగ్గరఁ బిల్చి
కాకుమాటలాడితట కలదా ఇంత
ఆకుమడిచియిమ్మంటా నందుకోఁ బోయి గొర
రేక లంటించితివట రీతిగాదుమ్మీ

(॥అందు॥)
పాదములొత్తుమీయంటా పడఁతి పైఁ బారఁజాఁచి
యేదెసో మోపితివట ఇది దగునా
పోదిగా నీతురుమునఁ బూవులు ముడువుమంటా
పాదుగ వీఁపున నాకెపై నొరగఁదగునా

(॥అందు॥)
పానుపు వరచుమంటా పడఁతిఁ గాఁగిటం బట్టి
అనెలవుననే కూడి తాయఁగా పని
నేను వచ్చితి నింతలో నెరవుగాఁ గూడితివి
యీనిజము శ్రీవేంకటేశ నీకే తగును

(||pallavi||)
aṁduge po nīvaddi kappaḍanuṁṭi rādu
kaṁduvage vichchesi kaigŏnumī sĕlini

(||aṁdu||)
yegadamāḍenaṁṭā niṁti daggaram̐ bilsi
kāgumāḍalāḍidaḍa kaladā iṁta
āgumaḍisiyimmaṁṭā naṁdugom̐ boyi gŏra
rega laṁṭiṁchidivaḍa rīdigādummī

(||aṁdu||)
pādamulŏttumīyaṁṭā paḍam̐ti paim̐ bāram̐jām̐si
yedĕso mobidivaḍa idi dagunā
podigā nīdurumunam̐ būvulu muḍuvumaṁṭā
pāduga vīm̐puna nāgĕbai nŏragam̐dagunā

(||aṁdu||)
pānubu varasumaṁṭā paḍam̐tim̐ gām̐giḍaṁ baṭṭi
anĕlavunane kūḍi tāyam̐gā pani
nenu vachchidi niṁtalo nĕravugām̐ gūḍidivi
yīnijamu śhrīveṁkaḍeśha nīge tagunu