(॥పల్లవి॥)
అందుకే పో నీచేత నగడైతిమి
యిందరిని మొఱఁగేవు యేడ చొచ్చేదే
(॥అందు॥)
పంతమే కావలె నొండె పతితో నిప్పటివేళ
సంతమే కావలెఁగాక సటలేఁటిదే
వంతులకుఁ బెనఁగేవు వాదులకు వచ్చేవు
యింతలో రెండూనై తే యేడ చొచ్చేదే
(॥అందు॥)
నగవే కావలె నొండె నడుమ నీతనితోడి
తెగువ గావలెఁగాక తిట్టులేఁటిదే
మొగమునుఁ జూచేవు మోనానఁ దలవంచేవు
యెగదిగపోఁతలైతే నేడ చొచ్చేదే
(॥అందు॥)
సిగ్గులే కావలె నొండె శ్రీవేంకటేశు నిట్టె
దగ్గరి కూడుటే కాక తచ్చనేఁటిదే
అగ్గమై కూడితివి అన్నిమాఁట లాడితివి
యెగ్గులు నెమ్మెలునైతే నేడ చొచ్చేదే
(||pallavi||)
aṁduge po nīseda nagaḍaidimi
yiṁdarini mŏṟam̐gevu yeḍa sŏchchede
(||aṁdu||)
paṁtame kāvalĕ nŏṁḍĕ padido nippaḍiveḽa
saṁtame kāvalĕm̐gāga saḍalem̐ṭide
vaṁtulagum̐ bĕnam̐gevu vādulagu vachchevu
yiṁtalo rĕṁḍūnai te yeḍa sŏchchede
(||aṁdu||)
nagave kāvalĕ nŏṁḍĕ naḍuma nīdanidoḍi
tĕguva gāvalĕm̐gāga tiṭṭulem̐ṭide
mŏgamunum̐ jūsevu monānam̐ dalavaṁchevu
yĕgadigabom̐talaide neḍa sŏchchede
(||aṁdu||)
siggule kāvalĕ nŏṁḍĕ śhrīveṁkaḍeśhu niṭṭĕ
daggari kūḍuḍe kāga tachchanem̐ṭide
aggamai kūḍidivi annimām̐ṭa lāḍidivi
yĕggulu nĕmmĕlunaide neḍa sŏchchede