అందుకే పో నవ్వు వచ్చీ నప్పటనుండి
(॥పల్లవి॥)
అందుకే పో నవ్వు వచ్చీ నప్పటనుండి
అందుకు మొక్కఁ బోతేను ఆయములు సోఁకెఁగా
(॥అందుకే॥)
సంగడా లెత్తినచేయి చాఁచేవు మావురముపై
నంగనలము మా చన్ను లంత కోపునా
యెంగిలితమ్మ రాలెను యింతలో నీచేతిమీఁద
సంగతి నేమో సేయఁగ సరి నేమో యాయఁగా
(॥అందుకే॥)
విరులు ముడిచి నట్టిసిరసు మాతొడమీఁద
నెరవుగఁ బెట్టుకొని నిద్దరించేవు
పొరి నాపాదాలమీఁద బూవు లెల్ల రాలఁగాను
దొరతనానకు రాఁగా దొమ్మిపూజ లాయఁగా
(॥అందుకే॥)
గందము పూసినమేను కాఁగిట నన్నుఁ గూడఁగ
చిందే నా చెమట నీపై చిప్పిలఁగను
అందపు శ్రీవెంకటేశ అలమేల్‌మంగను నేను
కందువఁ గూడితి విట్టె కత లై నిలిచెఁ గా
(||pallavi||)
aṁduge po navvu vachchī nappaḍanuṁḍi
aṁdugu mŏkkam̐ bodenu āyamulu som̐kĕm̐gā
(||aṁduge||)
saṁgaḍā lĕttinaseyi sām̐sevu māvuramubai
naṁganalamu mā sannu laṁta kobunā
yĕṁgilidamma rālĕnu yiṁtalo nīsedimīm̐da
saṁgadi nemo seyam̐ga sari nemo yāyam̐gā
(||aṁduge||)
virulu muḍisi naṭṭisirasu mādŏḍamīm̐da
nĕravugam̐ bĕṭṭugŏni niddariṁchevu
pŏri nābādālamīm̐da būvu lĕlla rālam̐gānu
dŏradanānagu rām̐gā dŏmmibūja lāyam̐gā
(||aṁduge||)
gaṁdamu pūsinamenu kām̐giḍa nannum̐ gūḍam̐ga
siṁde nā sĕmaḍa nībai sippilam̐ganu
aṁdabu śhrīvĕṁkaḍeśha alamelmaṁganu nenu
kaṁduvam̐ gūḍidi viṭṭĕ kada lai nilisĕm̐ gā