Amduge nenoo natte amdaalu sesugomti

అందుకే నేనూ నట్టే అందాలు సేసుకొంటి
Language

(॥పల్లవి॥)
అందుకే నేనూ నట్టే అందాలు సేసుకొంటి
ఇందుముఖుల చెల్లించ నెన్నఁడు నేరిచెనే

(॥అందు॥)
చలమున సాదించగా చన విచ్చినవాఁడాయ
సెలవిఁ దిట్టితే నవ్వులు సేసుకొనీని
పలుక కూరకుండితే భావము గరఁగె ననీ
యెలమి నిన్నేసివిద్య లెన్నఁడు నేరిచెనే

(॥అందు॥)
జంకించితే నాకుఁదాను సన్నసేసిన వాఁడాయ
కంకిగ వెంగెమాడితే కతసేసీని
బింకాన నేఁ జూచితేను ప్రియము సేసుకొనీని
ఇంకా మానఁడు మెచ్చీ నెన్నఁడు నేరిచెనే

(॥అందు॥)
పెనంగితే నంతలోనే బెరసిన వాఁడాయ
గనముగా మొక్కితేను కాఁగిలించీని
మనసిచ్చి యలమేలుమంగను నేనేకనక
యెనసె శ్రీవేంకటేశుఁ డెన్నఁడు నేరిచెనే

(||pallavi||)
aṁduge nenū naṭṭe aṁdālu sesugŏṁṭi
iṁdumukhula sĕlliṁcha nĕnnam̐ḍu nerisĕne

(||aṁdu||)
salamuna sādiṁchagā sana vichchinavām̐ḍāya
sĕlavim̐ diṭṭide navvulu sesugŏnīni
paluga kūraguṁḍide bhāvamu garam̐gĕ nanī
yĕlami ninnesividya lĕnnam̐ḍu nerisĕne

(||aṁdu||)
jaṁkiṁchide nāgum̐dānu sannasesina vām̐ḍāya
kaṁkiga vĕṁgĕmāḍide kadasesīni
biṁkāna nem̐ jūsidenu priyamu sesugŏnīni
iṁkā mānam̐ḍu mĕchchī nĕnnam̐ḍu nerisĕne

(||aṁdu||)
pĕnaṁgide naṁtalone bĕrasina vām̐ḍāya
ganamugā mŏkkidenu kām̐giliṁchīni
manasichchi yalamelumaṁganu neneganaga
yĕnasĕ śhrīveṁkaḍeśhum̐ ḍĕnnam̐ḍu nerisĕne