Amduge mokke nenu aadani kide

అందుకే మొక్కే నేను ఆతని కిదే
Language

(॥పల్లవి॥)
అందుకే మొక్కే నేను ఆతని కిదే
పొందుగా విన్నవించరే పొలఁతులాల

(॥॥)
పొంచి సింగారాలకు బొమ్మల జంకింతుఁ గాని
మించి మేలువాఁడు తాను మిక్కిలి నాకూ
అంచెల గుట్టు గాన నీ కటు మెచ్చకుందుఁ గాని
మంచిమాట లెల్లా నాడి మన్నించునే

(॥॥)
సేసే తరితీపులకు సిగ్గులు వడుదుఁ గాని
ఆసల నన్నుఁ బెండ్లాడి నప్పుడే తానూ
వాసులు చూప వలసి వన్నెల సొలతుఁ గాని
బాసతోడఁ జనవిచ్చి పాలించునే

(॥॥)
చవులు చూపవలసి సమ్మతించకుందుఁ గాని
వివరించి నా ప్రాణవిభుఁడే తాను
జవళి శ్రీ వేంకటేశ్వరుఁ డలమేల్మంగను
కవగూడి నన్నిటాను ఘనుఁడే తాను

(||pallavi||)
aṁduge mŏkke nenu ādani kide
pŏṁdugā vinnaviṁchare pŏlam̐tulāla

(||||)
pŏṁchi siṁgārālagu bŏmmala jaṁkiṁtum̐ gāni
miṁchi meluvām̐ḍu tānu mikkili nāgū
aṁchĕla guṭṭu gāna nī kaḍu mĕchchaguṁdum̐ gāni
maṁchimāḍa lĕllā nāḍi manniṁchune

(||||)
sese taridībulagu siggulu vaḍudum̐ gāni
āsala nannum̐ bĕṁḍlāḍi nappuḍe tānū
vāsulu sūba valasi vannĕla sŏladum̐ gāni
bāsadoḍam̐ janavichchi pāliṁchune

(||||)
savulu sūbavalasi sammadiṁchaguṁdum̐ gāni
vivariṁchi nā prāṇavibhum̐ḍe tānu
javaḽi śhrī veṁkaḍeśhvarum̐ ḍalamelmaṁganu
kavagūḍi nanniḍānu ghanum̐ḍe tānu